ఆ ఫోన్ కాల్స్ తో లగడపాటి కి తలనొప్పి?

Posted May 19, 2017 at 13:00

lagadapati rajagopal troubles on political leaders
కర్మసిద్ధాంతాన్ని బాగా నమ్మే మన దేశంలో ఓ విషయాన్ని తరచూ చెప్పుకుంటూ వుంటారు. “అదృష్టవంతుణ్ణి చెడగొట్టేవారు లేరు ..దురదృష్టవంతుణ్ణి బాగు చేసే వారు లేరని”. కానీ ఈ విషయాన్ని మర్చిపోయిన నాయకులు చాలా మంది ఇప్పుడు మాజీ ఎంపీ లగడపాటి రాజకీయ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజనతో పెద్ద నాయకులు చాలా మంది చిన్న నాయకులు కావడమే కాదు..వారి రాజకీయ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది. దీంతో 2019 నాటికి అధికార టీడీపీ,ప్రతిపక్ష వైసీపీ,కొత్తగా వస్తున్న జనసేన వీటిలో ఏదో ఓ పార్టీలో చేరాల్సిన పరిస్థితి. పవన్ పాత నాయకుల మీద పెద్ద ఇంటరెస్ట్ చూపడం లేదని ఇప్పటికే వినిపిస్తున్న మాట. ఇక టీడీపీ,వైసీపీ ల్లో ఏ పార్టీ బెటర్ అనే దాని కన్నా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం లోకి వస్తుంది అన్న దానిపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు ఆ నాయకులు.ఇంకా రాజకీయ వాతావరణం క్లారిటీ గా లేకపోవడంతో సర్వే లో నిపుణుడైన లగడపాటి ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఫాలో అయిపోదామని ఓ టీం ఇప్పటికే రెడీ గా ఉందట.అందులో మాజీ మంత్రులు,ఎంపీలు వున్న విషయం ఇప్పుడిప్పుడే బయటికి వస్తోంది.

ఈ నాయకులంతా ప్రస్తుతానికి రాజకీయంగా యాక్టివ్ గా లేరు.వీళ్ళు చేస్తున్న పని ఒక్కటే .అదేమిటంటే పాత పరిచయాన్ని దృష్టిలో ఉంచుకుని వారానికోసారి రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎలా ఉందని లగడపాటికి ఫోన్ చేసి అడగడం.అంతటితో ఆగకుండా ఏ పార్టీలోకి వెళతావని ఆయన్ని ప్రశ్నించడం.ఈ ఫోన్ కాల్స్ లగడపాటికి పెద్ద తలనొప్పి గా మారాయట.సూటిగా ఏ విషయం చెప్పలేక లగడపాటి ఇబ్బంది పడుతున్నారట.ఇలా ఫోన్ చేస్తున్న నాయకులు ఓ విషయం మర్చిపోతున్నారు..ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోదని చెప్పింది కూడా ఈ లగడపాటి కాదా? అందుకే ఈ నాయకులు తమ నిర్ణయం తాము తీసుకుంటే నయం.

SHARE