మెగా ఐటమ్ : కేథరిన్ కాదు.. రాయ్ లక్ష్మీ

Posted October 13, 2016

 lakshmi rai item song chiru khaidi number 150 movie

మెగా ‘ఖైదీ’ ఇరగదీస్తున్నాడు. ఖైదీలను కుమ్మేసి పని కూడా అయిపోయింది. ఇప్పుడు చిందేసే టైమొచ్చింది. వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న
మెగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం “ఖైదీ నెం.150”. ఇటీవలే యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించారు. అవి సూపర్భ్ గా వచ్చాయట. ఇపుడు అదిరిపోయే అటమ్ సాంగ్
ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, తాజా సమాచారమ్ ప్రకారం చిరు ఐటమ్ భామ మారిందట.

మెగా ‘ఖైదీ’లో చిరు ఐటమ్ భామగా కేథరిన్ చిందేయనుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు ఈమె స్థానంలో రాయ్ లక్ష్మీ వచ్చి చేరినట్టు
ఫిల్మ్ నగర్ సమాచారమ్. ఈ మార్పుకి అసలు కారణలేంటో మాత్రం తెలియరాలేదు.గతంలో ‘సర్థార్ గబ్బర్ సింగ్’లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో కలసి చిందేసింది రాయ్ లక్ష్మీ. ఇప్పుడు మెగాస్టార్ కూడా ఈమె అందాల వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ కి ఏర్పాట్లు జరగనున్నాయి. మరీ.. రాయ్ లక్ష్మీ మెగాస్టార్ ని, ఆయన ఫ్యాన్స్ ని ఏ మేరకు తృప్తిపరుస్తుందో చూడాలి. ఇక, ఈ చిత్రలో చిరు సరసన కాజల్ జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. రాంచరణ్ నిర్మాత.

SHARE