ధోనిని ఆటాడుకున్న లక్ష్మి రాయ్

Posted September 28, 2016

 lakshmi rai said dhoni relationship
ఎం.ఎస్ .ధోని ప్రపంచంలో మేటి బౌలర్ లతో ఓ ఆటాడుకుంటే ..అతన్ని ఓ ఆటాడుతోంది అందాల భామ లక్ష్మి రాయ్.కొన్ని నెలలపాటు ధోనితో గతంలో డేటింగ్ చేశానని చెప్తున్న ఆమె అంతటితో ఆగలేదు.ధోని డేటింగ్ చేసిన అమ్మాయిల జాబితా చాంతాడంత ఉంటే నన్నొక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారని మండిపడింది ఈ ముద్దుగుమ్మ.ధోని తో రిలేషన్ షిప్ నడిపిన అమ్మాయిల గురించి చెప్పడం తన ఉద్దేశం కాదని అంటూనే అన్ని విషయాలు కక్కేసింది లక్ష్మి.

అయితే ధోని మనస్తత్వం సరిపడకే తాను దూరమైనట్టు వివరించింది.మరో వైపు పెళ్ళై పిల్లలున్న వ్యక్తి గురించి ఇలాంటి సంగతులు మాట్లాడుకోవడం మంచిదికాదని స్టేట్ మెంట్ ఇచ్చింది.అన్ని సంగతులు బయటపెట్టి ఇలా మాట్లాడ్డం సమంజసమేనా అంటే ..ఇకపై ధోని క్రికెటర్ గానే తెలుసు ..వ్యక్తిగత పరిచయం లేదని చెప్తానని అని బదులిచ్చింది.ఇప్పుడు చెప్పండి పాత రిలేషన్ అడ్డం పెట్టుకుని అమ్మడు ధోనితో ఆటాడుకుందా…లేదా

SHARE