మెగా ఐటమ్ తట్టుకోలేకపోతుంది!

 Posted October 17, 2016

lakshmi rai tweet chiru 150 movie item song

హ్యాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ మెగా ఐటమ్ గా మారిన విషయం తెలిసిందే. మెగాస్టార్ “చిరంజీవి ఖైదీ నెం. 150” స్పెషల్ సాంగ్ నుంచి ముద్దుగుమ్మ కేథరిన్ ని తొలగించడంటో.. ఆ అవకాశం లక్ష్మీరాయ్ కి దక్కింది. సడెన్ గా వచ్చిన ఆఫర్ తో  లక్ష్మి రాయ్ గాల్లో తేలుతోంది. తాజాగా, స్పెషల్ సాంగ్ షూటింగ్ పాల్గొన్న లక్ష్మీరాయ్ మెగాస్టార్ చిరంజీవిని చూసి తట్టుకోలేకపోయింది. ‘చిన్నప్పటి నుంచీ తాను మెగాస్టార్‌కి ఫ్యాన్ ని. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మాటకు ఆయన నిదర్శనం. ఆయన రియల్ లెజెండ్‌. డైమాండ్. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదు’ అంటూ ఆమె ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొంది.

వివి వినాయక్ దర్శకత్వంలో తమిళ్ ‘కత్తి’ రిమేక్ గా తెరకెక్కుతోన్న ‘ఖైదీ నెం. 150’లో చిరు సరసన కాజల్ జతకట్టనుంది. లక్ష్మీరాయ్ ఐటమ్ సాంగ్ లో
మెరవనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. రాంచరణ్ నిర్మాత. అన్నట్టు.. ఇందులో మెగా సప్రరైజ్ ఉండబోతుందట.. అదేనండీ మెగా యంగ్ హీరోలంతా ‘ఖైదీ’లో కనిపించబోతున్నారంటూ టాక్.

A true legend!I am the living example ✨gem of a person , heart of gold ufff words falling short 2 admire this man ☺️

SHARE