రాజధానిలో పరువు హత్య …ఓ స్వామిజీ ప్రస్తావన

Posted September 29, 2016

  lalith adithya murder hyderabad
రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున పరువు హత్య సంచలనం రేపింది. లలిత్ ఆదిత్య, సుస్మితారెడ్డి 8 నెలల కిందట ప్రేమవివాహం చేసుకున్నారు.కూతురు కులాంతర వివాహం చేసుకోవడం నచ్చని తల్లితండ్రులు అల్లుడు,వారి తరపు వాళ్ళతో గొడవపడేవాళ్లు.అమ్మాయి,అబ్బాయి మధ్య ఏమి జరిగిందో గానీ ఆమె నిన్న పుట్టింటికి వెళ్ళింది.ఈ తెల్లవారుజామున లలిత్ ఆదిత్య హత్యకి గురయ్యాడు.అతన్ని కత్తులతో పొడిచి,మర్మాంగాలు మీద దాడి చేసి చంపేశారు. దీనివెనుక అమ్మాయి తల్లితండ్రుల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.విచారణ కొనసాగుతోంది.

మరో వైపు ఈ వ్యవహారంలో నమ్మకాలు,జాతకాలు పాత్ర కూడా ఉందని తెలుస్తోంది.కూతురు వేరే కులం వాడిని పెళ్లిచేసుకోవడం నచ్చని తండ్రి దోషాల వల్ల ఇలా జరిగివుండొచ్చని నమ్మారట.వాటి నివారణ కోసం కొందర్ని ఆశ్రయించారట.అందులో టీవీ ల్లో సమస్యలకి పరిష్కారం చెప్పే ఓ స్వామి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని మృతుడి తల్లి స్వయంగా చెప్పింది.

SHARE