లాలూ,రబ్రీ రాజకీయ ఆదర్శ జంట ..

0
389
bn-cb714_ilalu2_g_20140325092216

Posted [relativedate]

Image result for lalu prasad yadav and wife

రాజకీయ నేతలకి మాట మార్చడం కొత్తేమీ కాదు.అయితే నోట్ల రద్దు వంటి పెద్ద పెద్ద విషయాల్లోనూ తేలిగ్గా మాట మార్చేయొచ్చని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ నిరూపించారు.నిన్నమొన్నటిదాకా నోట్లరద్దుపై మోడీని తూర్పారబట్టిన లాలూ అబ్బే అదేమీ లేదన్నారు.రద్దుపై తాను వ్యతిరేకం కాదని..దాన్ని డీల్ చేయడంలో సమస్యల గురించే బాధన్నారు.లాలూ మాట మారగానే మమతా,కేజ్రీవాల్ వంటి నేతల దిమ్మ తిరిగింది.అయితే దీని వెనుక బీహార్ సీఎం నితీష్ మ్యాజిక్ వుంది.మోడీ నిర్ణయాన్ని మొదటినుంచి సమర్థిస్తున్న నితీష్ తో భేటీ తర్వాతే లాలూ మాట మార్చేశారు.మోడీ నిర్ణయాన్ని సమర్ధించిన నితీష్ ని దగ్గర చేసుకోటానికి బీజేపీ ప్రయత్నాలు మొదలెట్టింది.దీంతో లాలూ డిఫెన్స్ లో పడ్డారు.వెంటనే నితీష్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు.మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ప్రజాభిమానం కోల్పోతామని నితీష్ ఆయన్ని ఒప్పించడంతో లాలూ ప్లేట్ ఫిరాయించారు.

అటు లాలూ సతీమణి రబ్రీదేవి కూడా టంగ్ ట్విస్ట్ చేశారు.నితీష్ కి స్నేహహస్తం చాపిన బీహార్ బీజేపీ అగ్రనేత సుశీల్ కుమార్ మోదీ మీద రబ్రీ విరుచుకు పడ్డారు.నితీష్ మీద అంత ప్రేముంటే చెల్లెలనిచ్చి పెళ్లి చేయాలన్నారు.అయితే దానిపై విమర్శలు రావడంతో రబ్రీ షరామామూలుగా మాట మార్చారు.సుశీల్ కుమార్ తనకు మరిది లాంటి వాడని …ఓ వదినగా ఆ మాత్రం సరదాగా మాట్లాడకూడదా అని ఎదురు ప్రశ్నించారు.అబ్బా లాలూ,రబ్రీ ని రాజకీయాలకి అచ్చు గుద్దినట్టు సరిపోయే ఆదర్శ జంట అనిపించడంలేదా?

Leave a Reply