మోడీని ముగ్గులోకి లాగిన లాలూ కొడుకు..

 lalu's son tej pratap yadav giving shocked modi
లాలూ తరహా రాజకీయాలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇప్పుడు ఆయన కొడుకు సైతం తండ్రికి ఏ మాత్రం తీసిపోనని నిరూపించాడు.బీహార్ క్యాబినెట్ లో ఆరోగ్యశాఖ మంత్రిగా వున్న లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ హత్య కేసు నిందితుడితో వున్న ఫోటోలు సంచలనం రేపాయి.ప్రతిపక్షంలో వున్న బీజేపీ అయన రాజీనామాకు డిమాండ్ చేస్తోంది.దానికి బదులిస్తూ రోజుకి తనను వెయ్యిమంది కలుస్తుంటారని ఎవరేమిటో తనకెలా తెలుస్తుందని తేజ్ ప్రతాప్ వాదించారు.అప్పటికీ బీజేపీ వెనక్కి తగ్గకపోవడంతో తేజ్ ఏమి చేశారో తెలుసా?

ఓ సెక్స్ రాకెట్ కేసులో నిందితుడు టీను జైన్ గతంలో మోడీని కలిసిన ఫోటోని తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు తేజ్ ప్రతాప్..ఇప్పుడు మోడీ రాజీనామా చేస్తే నేను కూడా రాజీనామా చేస్తానని కమలం నేతలకి సవాల్ విసిరాడు.లాలూ కొడుకు మొత్తానికి తండ్రికి తగ్గ రాజకీయ నేత అనిపించాడు.

SHARE