నందమూరి సినిమాలో లాస్య..!

Date:

నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమ్మెల్యే’. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌కు చెల్లిగా యాంకర్‌ లాస్య నటించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అధికారిక సమాచారం అందుతుంది. ‘రాజా మీరు కేక’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించిన లాస్యకు హీరోయిన్‌ అవ్వాలనే కోరిక ఉంది. కాని హీరోయిన్‌ ఛాన్స్‌లు రాకపోవడంతో వెండి తెరపై చెల్లి పాత్రలో, హీరోయిన్‌ ఫ్రెండ్‌ పాత్రలో అయినా నటించాలని లాస్య ఆశపడుతుంది.

లాస్యకు అనుకోని అవకాశంలా ‘ఎమ్మెల్యే’ చిత్రంలో నటించే ఛాన్స్‌ దక్కింది. కళ్యాణ్‌ రామ్‌తో పాటు కాజల్‌ చాలా ఆశలు పెట్టుకుని నటించబోతున్న ఆ సినిమాపై నందమూరి అభిమానుల్లో కూడా అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండి లాస్యకు మంచి పేరును తెచ్చి పెడుతుందేమో చూడాలి. రవితో విభేదాలు వlletచ్చిన తర్వాత లాస్య బుల్లి తెరపై యాంకర్‌గా చేయాలని భావించినా కూడా ఆమెకు అవకాశం రావడం లేదు. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న లాస్యకు బుల్లి తెర ఛాన్స్‌లు గగణం అయ్యాయి. దాంతో వెండి తెరపై సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. బుల్లి తెరపై సక్సెస్‌ అయ్యి, వెంటనే ఫేడ్‌ ఔట్‌ అయిన లాస్యకు వెండి తెరపై అయినా మంచి గుర్తింపు వస్తుందా అనేది చూడాలి.

Leave a Reply

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

మగవాళ్ళ కోసం తీసిన మూవీ #mentoo #mentoopublictalk #tollywood #vennelakishore #trending #shorts

మగవాళ్ళ కోసం తీసిన మూవీ #mentoo #mentoopublictalk #tollywood #vennelakishore #trending #shorts

నరేష్ ,పవిత్ర లోకేష్ రిలేషన్ నాకు నచ్చింది#mallipelli #msraju #publictalk #shortvideo#ytshort #viral

నరేష్ ,పవిత్ర లోకేష్ రిలేషన్ నాకు నచ్చింది#mallipelli #msraju #publictalk #shortvideo#ytshort #viral

మాకేంటిది నరేష్ గారు #naresh #pavitra #mallipelli #publictalk #shortvideo #trending #subscribe

మాకేంటిది నరేష్ గారు #naresh #pavitra #mallipelli #publictalk #shortvideo #trending #subscribe

మీకు కచ్చితంగా నచ్చుతుంది #tollywood #publictalk #publicreaction #shortvideo #ytshortsviral #shorts

మీకు కచ్చితంగా నచ్చుతుంది #tollywood #publictalk #publicreaction #shortvideo #ytshortsviral #shorts
%d bloggers like this: