ఈసారి ఆశలు రేపడం రజని భార్య వంతు..

0
308
latha rajani hopes to rajani fans

latha rajani hopes to rajani fans

“నువ్వొస్తానంటే మేమొద్దంటామా”… అని రజని రాజకీయ రంగప్రవేశం గురించి ఎప్పటినుంచో ఆయన ఫ్యాన్స్,తమిళ ప్రజలు పాడుతూనే వున్నారు.ప్రతిసారి ఆశలు రేపడం,ఆపై జారుకోవడం రజని ఓ దశాబ్ద కాలంగా చేస్తూనే వున్నారు.జయ మరణం తర్వాత రజని మాటలు,చేతలు,భేటీలు చూసి ఈసారి రజని రాజకీయాల్లోకి రావడం ఖాయమని అంతా భావించారు.ఆర్కే నగర్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న గంగై అమరన్ స్వయంగా రజని ఇంటికి రావడంతో ఇక ప్రకటన రావడమే తరువాయి అని ఆయన ఫ్యాన్స్ భావించారు.వాళ్ళు అనుకున్నట్టే స్టేట్ మెంట్ వచ్చింది.అయితే అందులో సారాంశం ఏమిటంటే ..ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో రజని ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని.దీంతో రజని ఫ్యాన్స్ డీలా పడ్డారు.ఆయన్ని అభిమానించే కొందరు ఇక జీవితంలో రాజకీయాల్లోకి రానని ఓ ప్రకటన చేస్తే మాకు ఈ ఆశనిరాశలు వుండవు కదా అని కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది.ఇంతలో అనుకోని మలుపు ..

రజని భార్య లత ఓ కార్యక్రమం కోసం మీడియాని ఫేస్ చేయాల్సి వచ్చింది.వెంటనే జర్నలిస్టులు ఆమెని రజని రాజకీయం గురించి అడిగారు.ఆమె సమాధానం దాటవేస్తారని అంతా భావించారు.”అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఆలోచనలున్నాయ్ ..రజని ఓ ప్రకటన చేస్తారు” …అని లతా రజని జవాబు ఇవ్వడంతో ఒక్కసారిగా ఆయన ఫ్యాన్స్ లో జోష్ పెరిగింది.ఆర్కే నగర్ ఉప ఎన్నికలు పూర్తి అయ్యాక ..ప్రజల ఆలోచనలు అర్ధం చేసుకుని,దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని రజని భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఇలా ఏ విధంగా చూసినా ఆర్కే నగర్ ఉప ఎన్నిక తమిళ రాజకీయాల్ని నిర్దేశించబోతోంది.

Leave a Reply