గ్లామర్‌ షో ఎఫెక్ట్‌.. లావణ్యంకు మెగా ఆఫర్స్‌

0
293
lavanya tripathi glamour role in sai dharam tej and vv vinayak movie

Posted [relativedate]

lavanya tripathi glamour role in sai dharam tej and vv vinayak movie
‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్న నాయన’ చిత్రాలు సక్సెస్‌ అయినా లావణ్య త్రిపాఠికి పెద్దగా అవకాశాలను తీసుకు రాలేక పోయాయి. కారణం ఆ చిత్రాల్లో లావణ్య త్రిపాఠి ట్రెడీషనల్‌ లుక్‌లో కనిపించడం, అందా ఆరబోత చేయక పోవడం. తాజాగా విడుదలైన ‘మిస్టర్‌’ చిత్రంలో ఈమె చేసిన గ్లామర్‌ షోతో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ‘మిస్టర్‌’ చిత్రం ఫ్లాప్‌ అయినా కూడా మరో మెగా ఆఫర్‌ను ఆ అమ్మడు దక్కించుకుంది.

‘ఖైదీ నెం.150’ చిత్రం తర్వాత వివి వినాయక్‌ దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. వివి వినాయక్‌ పలువురు స్టార్‌ హీరోలతో సినిమా అనుకుని చివరకు సాయి ధరమ్‌ తేజ్‌తో ఫిక్స్‌ అయ్యాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఆ సినిమా వచ్చే నెలలో పట్టాలెక్కే అవకాశాలున్నాయి. త్వరలో నటించబోతున్న సినిమాలో కూడా లావణ్య త్రిపాఠి మరింత గ్లామర్‌గా కనిపించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. వినాయక్‌ దర్శకత్వంలో లావణ్య చేయబోతున్న సినిమా సక్సెస్‌ అయితే ఆమెకు స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌లు రావచ్చు.

Leave a Reply