గ్లామర్‌పై అందరి పాటే పాడిన లావణ్యం

Posted April 13, 2017

lavanya tripati accepted to act in glamor roles
‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న లావణ్య త్రిపాటి ఇప్పటి వరకు గ్లామర్‌కు కాస్త దూరంగా పద్దతైన పాత్రల్లో నటించింది. తాజాగా ఈ అమ్మడు నటించిన ‘మిస్టర్‌’ చిత్రంలో మోతాదుకు మించిన గ్లామర్‌తో నటించినట్లుగా టీజర్‌, ట్రైలర్‌, పోస్టర్స్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది. గ్లామర్‌ డోస్‌ పెంచితేనే స్టార్స్‌ సరసన అవకాశాలు వస్తాయని గ్రహించిన ఈ అమ్మడు ఇక చేసేది లేద అందాల ప్రదర్శణకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో రెండు చిత్రాలకు కమిట్‌ అయ్యింది. ఆ సినిమాల్లో కూడా అందాలతో ఆకట్టుకోవాలని ఈ అమ్మడు భావిస్తుంది. ‘మిస్టర్‌’ చిత్రం ఫలితం తర్వాత మరింతగా గ్లామర్‌ డోస్‌ను పెంచడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ చెప్పుకొచ్చింది. అయితే గ్లామర్‌ పేరుతో బట్టలు విప్పేసి, వల్గర్‌గా కనిపించడం తనకు ఇష్టం లేదని, పాత్ర పరిధిలో కురచ దుస్తులు వేసుకునేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ చెప్పుకొచ్చింది. స్టార్‌ హీరోయిన్స్‌ నుండి చిన్న హీరోయిన్స్‌ వరకు అంతా కూడా కథ డిమాండ్‌ మేరకు తాను అందాల ప్రదర్శణ చేస్తా తప్ప విచ్చలవిడిగా డ్రస్‌లు విప్పేయను అంటూ చెప్పుకొస్తారు.

వందలో ఒక్కటి రెండు కథల్లో ఒక్కటి రెండు సీన్స్‌లలో మాత్రమే హీరోయిన్‌ హాట్‌గా కనిపించేలా ఉంటాయి. కాని ప్రస్తుత హీరోయిన్స్‌ అంతా కూడా గ్లామర్‌కే ప్రాముఖ్యత ఇస్తారు. కథ డిమాండ్‌ చేయకున్నా గ్లామర్‌గా కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేస్తూ ఉంటారు. అదే మాదిరిగా ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా గ్లామర్‌ అందాల ప్రదర్శణకు సిద్దం అయ్యింది. అందాల ప్రదర్శణ ఈమెకు మరిన్ని అవకాశాలు తీసుకు వస్తాయేమో చూడాలి.

SHARE