అర్రె… అక్కడ మన “పటాస్” పేలలేదే..

0
474
lawrence motta shiva ketta shiva movie flop to remake of patas movie in tamil

Posted [relativedate]

lawrence motta shiva ketta shiva movie flop to remake of patas movie in tamilనందమూరి కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ సినిమా గుర్తింది కదూ.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా పేలింది. కళ్యాణ్ రామ్ కెరిరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు తెలుగు ప్రేక్షకుల ఆదరణతో  కలెక్షన్లను  కూడా బాగా రాబట్టింది.  దీంతో ఈ చిత్రాన్ని కోలీవుడ్ లో  మోట్ట శివ.. కెట్ట శివ పేరుతో రీమేక్ చేశాడు రాఘవ లారెన్స్.  తెలుగు ప్రజల దగ్గర పేలిన ఈ పటాస్ తమిళ ప్రజల వద్ద మాత్రం  తుస్సుమంది.

కళ్యాణ్ రామ్ పాత్రను లారెన్స్, సాయి కుమార్ పాత్రను కట్టప్ప సత్యరాజ్ పోషించారు. నిక్కీ గల్రానీ ఈ తమిళ పటాస్ లో హీరోయిన్ గా నటించింది.  బడ్జెట్ లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు గానీ పటాస్ పేలకపోయే సరికి చిత్ర యూనిట్ నీరసపడింది. కాగా తమిళ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో చాలానే డిజాస్టర్ లుగా నిలిచాయి. అలానే తెలుగులో సూపర్ హిట్ అయినంత మాత్రాన తమిళులకి కూడా ఎక్కాలని లేదుగా.. ఏమంటారు.

Leave a Reply