చికెన్ కోసం చిందేసిన హీరో…!

0
367
lawrence says about chiru home food

Posted [relativedate]

lawrence says about chiru home foodరాఘవ లారెన్స్… తెలుగు ,తమిళ్ భాషల్లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వ్యక్తి.. మొదట డ్యాన్సర్ గా తన జీవిత ప్రయాణం ప్రారంభించి.. తర్వాత కొరియోగ్రాఫర్ గా ఎదిగి.. ఆ తర్వాత నటుడిగా మారి.. ఇప్పుడు దర్శకుడి గాను సత్తా చాటుతూ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు లారెన్స్ రాఘవ. ఇంతటి ఇమేజ్ సొంతం చేసుకొని చాలా బిజీ గా ఉన్న లారెన్స్.. మెగాస్టార్ నుంచి ఒక్క పిలుపు రాగానే వెంటనే వచ్చి ఖైదీ నంబర్ 150లో రత్తాలు పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశాడు. అసలు ఇలా చేయటానికి అసలు కారణం, దీని వెనక ఉన్న సీక్రెట్ చెప్పాడు లారెన్స్.

‘ఖైదీ నంబర్ 150లో పాటకు కొరియోగ్రఫీ అందించాలంటూ చిరంజీవి గారు స్పెషల్ గా నాకు ఫోన్ చేసి పిలిచారు. ఆయన నుంచి నాకు పిలుపు రాగానే.. వెంటనే ఫ్లైట్ పట్టుకుని హైద్రాబాద్ లో వాలిపోయా. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య ఎక్కడా రెమ్యూనరేషన్ అనే మాటే రాలేదు. కానీ చిరు అన్నయ్యకి ఒక కండిషన్ పెట్టాను. అది ఏంటంటే నాకు వదిన(సురేఖ) వండి పెట్టే స్పెషల్ దోశ.. చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం.. నేను రావాలి అంటే మాత్రం కచ్చితంగా అవి కావాల్సిందే’ అంటూ చెప్పాను. అన్నయ్య హ్యాపీ గా సరే అన్నాడు అని చెప్పుకొచ్చాడు లారెన్స్ మాస్టర్.

చిరుతో లారెన్స్ కు ఇంతటి అనుబంధం ఉండడానికి కారణం ఏంటంటే. లారెన్స్ లో ట్యాలెంట్ గుర్తించి మొదటగా కొరియోగ్రఫీ ఎ అవకాశం ఇచ్చినది చిరంజీవే. హిట్లర్ సినిమాలోని పాటలకు లారెన్స్ కంపోజ్ చేసిన స్టెప్స్.. ఇప్పటికీ సెన్సేషన్. ఆ తర్వాత ఏ స్థాయిలోనూ వెనుతిరిగి చూసుకోలేదు లారెన్స్.ఇప్పుడు ప్రస్తుతం పి. వాసు దర్శకత్వంలో రూపొందిన శివలింగ అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .

Leave a Reply