మెగా ఐటమ్ ‘లక్ష్మీరాయ్ పేమెంట్’.. ఎంతో తెలుసా ?

0
539

 Posted [relativedate]

  laxmi rai remuneration chiru khaidi number 150 movie

లక్కీగా లక్ష్మీరాయ్ మెగా ఐటమ్ గా మారిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ‘ఖైదీ నెం.150’ స్పెషల్ సాంగ్ కోసం ముందుగా కేథరిన్ తీసుకొన్నారు.తీరా షూటింగ్ ప్రారంభం అయ్యాక ఆమెని తప్పించారు. ఆమె స్థానంలో హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్ ని తీసుకొన్నారు. ఈ మార్పు మంచిదే అయిందని.. చిరు-లక్ష్మీరాయ్ జంట సూపర్భ్ గా సెటయ్యిందిని మెగా కాంపౌండ్ చెబుతోంది. లారెన్స్ కంపోజ్ చేసిన స్టెప్పులకి చిరు-లక్ష్మీరాయ్ ఇరగదీశారట. థియేటర్ లో ఫ్లోర్ దద్దరిల్లిపోవడం ఖాయమంటున్నారు.

అయితే, మెగా ఐటమ్ కోసం లక్ష్మీరాయ్ ఎంత తీసుకొంది.. ? చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.పెద్దగా డిమాండ్ లో లేని లక్ష్మీరాయ్ కి మెగా ఐటమ్ బాగానే గిట్టుబాటు అయ్యివుంటుందనే టాక్ నడుస్తోంది. కానీ.. అందులో నిజం లేదట. ఈ సాంగ్ కోసం ఈ హాట్ భామ‌కు 40 ల‌క్ష‌ల పారితోష‌కం ముట్ట‌చెప్పార‌ట‌. స్టార్ హీరోయిన్స్ తో పోలిస్తే ఈ హాట్ బ్యూటీకి ఇచ్చింది చాలా తక్కువే. అయితే, తీసుకొన్న పేమెంట్ ని లక్ష్మీరాయ్ పూర్తి న్యాయం చేసిందని చెబుతున్నారు. ఇక, మెగా ఐటమ్ లో లక్ష్మీరాయ్ ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. ఎందుకంటే.. మెగా ఖైదీ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply