మోడీకి, మూడు కోతులకూ సంబంధమేంటి..?

0
459
leader Narayana has been exposed to Prime Minister and Tamil Nadu Chiefs

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ నారాయణగా పాపులరైన కమ్యూనిస్టు లీడర్ నారాయణ ఉన్నట్లుండి ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంలపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. మొన్నటివరకూ అధికార పార్టీల్ని టార్గెట్ చేసి, జగన్ పై సాఫ్ట్ కార్నర్ తో ఉన్న నారాయణ.. ఇప్పుడు ఆయన్ను కూడా వదలడం లేదు. జగన్ లెఫ్ట్ తో పొత్తుకు ఆసక్తి చూపకపోవడంతో ఇక మొదలెట్టేశారు.

ప్రధాని మోడీ ముందు మూడు కోతులున్నాయని, వాటితో చంద్రబాబు, కేసీఆర్, జగన్ ను పోల్చి అన్ని హద్దులూ దాటేశారు నారాయణ. ఒకరు అన్యాయంపై మాట్లాడరని, మరొకరు ఏమీ చూడలేరని, ఇంకొకరికి అసలేమీ వినబడదని వివరించారు. ఇంతకూ ఈ ముగ్గురిలో ఎవరకు ఏ లక్షణం ఉందో చెప్పే బాధ్యత మాత్రం ప్రజలకే వదలిపిట్టారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉనికి లేకుండా పోయిన కమ్యూనిస్టులు సీఎంలను ఈ రకంగా తిట్టడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. నారాయణ వ్యాఖ్యల కారణంగా పార్టీని నష్టం జరుగుతోందని లెఫ్ట్ క్యాడర్ మొత్తుకుంటోంది. పార్టీని బలోపేతం చేయకుండా సంచలన ఆరోపణలతో ఏం సాధిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ నారాయణ మాత్రం షరా మామూలుగా నోటికొచ్చింది మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారు.

Leave a Reply