కాలి వేళ్ల సైజును బట్టి వ్యక్తిత్వం….

Posted September 29, 2016

 leg fingers known human being behavior
* కాలి వేళ్ళు అన్నింటిలో బొటనవేలు పెద్దదిగా ఉంటే వారు చాలా తెలివిగాను, సృజనాత్మకంగా ఉంటారట.
* అదే బొటనవేలు చిన్నగా ఉండేవారు ఏ పనైనా చాలా సులభంగా చేసేస్తారు.
* కాలి రెండో వేలు పొడవుగా ఉంటే వారిలో నాయకత్వ లక్షణాలు, దైర్యం ఎక్కువగా ఉంటుంది.
* అదే రెండో వేలు పొట్టిగా ఉండేవారు అందరితో కలివిడిగా ఉంటారు.
* కాలి మొదటి మూడు వేళ్ళు పొడవుగా ఉండి, చివరివి చిన్నగా ఉండేవారు చాలా శక్తివంతంగా, దృడంగా ఉండటమే కాకుండా ఊహించని శక్తి వీరిలో ఉంటుంది.
* బొటనవేలు పక్కన వేళ్ళు బొటనవేలి కన్నా పొట్టిగా ఉన్నవారు జీవితాన్ని అన్ని కోణాల్లోనూ ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషంగా ఉంటారు.
* కాలి చివరి వేలు, చిటికెన వేలు మినహా మిగతా వేళ్ళు అన్ని సమానంగా ఉండేవారు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాక ఎదుటి వారు చెప్పిన ప్రతి మాటనూ శ్రద్దగా వింటారు.
* కాలి వేళ్ళలో నల్గవ వేలు పొట్టిగా ఉన్నవారికి కుటుంబం, రిలేషన్స్ పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. వీరు బందాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.
* చిటికెన వేలు నాల్గవ వేలికి అంటుకొని ఉంటే, వీరు చాలా సిగ్గు, భయం కలిగి ఉంటారు. ఈ సిగ్గు కారణంగా భాధ్యతలకు కూడా దూరంగా ఉంటారు.
* అదే చిటికెన వేలు నలుగో వేలికి దూరంగా ఉంటే, వారు చాలా సాహసంగా ఉండటమే కాక చాలా చమత్కారంగా మాట్లాడతారు.

SHARE