అపోలో గుట్టు వారికి చేరిందా..?

Posted December 13, 2016

Legion threatens to leak information and data from Apollo Hospitals serversలీజియన్‌ గ్రూపు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అపోలో ఆసుపత్రి సర్వర్లకు సంబంధించిన వివరాలు తమ దగ్గర ఉన్నాయని అందులో భారత రాజకీయ ప్రముఖుల డేటా ఉందని వెల్లడించింది. ‘మా దగ్గరున్న సమాచారాన్ని బహిరంగపరిస్తే.. భారత్‌లో కల్లోలం తప్పదు’అని బాంబు పేల్చింది.

చెన్నై అపోలోలో తమిళనాడు దివంగత సీఎం జయలలిత 75 రోజుల పాటు చికిత్స తీసుకోవటం, అపోలో కేంద్రంగానే తమిళ రాజకీయాలు నడిచిన నేపథ్యంలో లీజియన్‌ గ్రూపు ఇంటర్వ్యూ సంచలనం రేపుతోంది. అయితే సమాచారం విడుదలపై మాత్రం ఎల్‌సీ ఎటువంటి వివరాలివ్వలేదు. కానీ, పలు భారత సర్వర్ల నుంచి సేకరించి, క్రోడీకరించిన సమాచారంలో భారత ప్రముఖులకు సంబంధించిన డేటా ఉందని మాత్రం చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా సర్వర్లను హ్యాక్‌ చేస్తోంది ఈ సంస్థ ,ఇటీవలే కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, వివాదాస్పద పారిశ్రామిక వేత్త విజయ్‌ మాల్యా, జర్నలిస్టులు బర్ఖాదత్, రవిష్‌ కుమార్‌ వంటి ప్రముఖుల ట్విటర్‌ ఖాతాలను హ్యాక్‌ చేసింది. ‘కొంతకాలంగా జరుగుతున్న ప్రయత్నంతో భారత్‌లోని 40వేలకు పైగా సర్వర్ల సమాచారంపై పట్టుచిక్కింది.

తమ తదుపరి లక్ష్యం ఐపీఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోదీయేనని చెప్పారన్నారు. ‘భారత్‌లో ట్విటర్‌ ఖాతాల హ్యాక్‌కు సంబంధించి ప్రజల సహకారం కావాలి. భారత్‌లో రాజకీయ, జర్నలిజంతోపాటు పలురంగాల ప్రముఖుల ట్విటర్‌ ఖాతాలను హ్యాక్‌ చేసిన ‘లీజియన్‌’గ్రూపు తాజాగా ఈ ప్రకటన చేయటం ఆసక్తి రేపుతోంది

SHARE