‘స్పైడర్‌’ టైటిల్‌కు విభిన్న రెస్పాన్స్‌

0
267
less response to mahesh spyder title

Posted [relativedate]

less response to mahesh spyder title
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబో చిత్రానికి తాజాగా ‘స్పైడర్‌’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇటీవలే ఫస్ట్‌లుక్‌ కూడా వచ్చింది. మహేష్‌బాబు మూవీ టైటిల్‌కు మిశ్రమ స్పందన వస్తుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా, మాస్‌ ఆడియన్స్‌కు అర్థం అయ్యేలా టైటిల్‌ లేదంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహేష్‌బాబు గత చిత్రాల టైటిల్స్‌తో పోల్చితే ఈ టైటిల్‌ పూర్తి విభిన్నంగా ఉందని, ఇలాంటి టైటిల్‌ తెలుగు ప్రేక్షకులకు ఎలా నప్పుతుందని భావిస్తున్నారంటూ విశ్లేషకులు కూడా కొందరు అంటున్నారు. సినిమా టైటిల్‌లోనే అసలు విజయం ఉంటుందని కొందరు ఫిల్మ్‌ మేకర్స్‌ అంటున్నారు.

మురుగదాస్‌ అండ్‌ టీం ఈ టైటిల్‌ను ఏ ఉద్దేశ్యంతో పెట్టారో కాని అందరిని మాత్రం ఆకట్టుకోలేక పోతున్నారు. ఏ క్లాస్‌ ఆడియన్స్‌కు మాత్రమే ఇలాంటి టైటిల్స్‌ ఎక్కుతాయి. బి, సి క్లాస్‌ ప్రేక్షకులు ఈ టైటిల్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. పైగా ఈ టైటిల్‌పై వివాదం కూడా మొదలవుతుంది. ఈ నేపథ్యంలో టైటిల్‌ మార్చాలంటూ యూనిట్‌ సభ్యులను కొందరు ఫ్యాన్స్‌ కోరుతున్నారు. మరి మురుగదాస్‌ మార్చుతాడా అనేది అనుమానమే. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను జూన్‌ నెలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply