ఆంధ్రాలో స్థానికత మార్గదర్శకాలివే ..

119

 local-status-way-standards
ఎట్టకేలకు స్థానికతపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. తెలంగాణ నుంచి సొంత రాష్ట్రం ఏపికి వెళ్లాలనుకునే వారికి స్థానికత కల్పించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల  చేసింది . ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వారు వచ్చే ఏడాది జూన్‌ రెండో  తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కేవలం తెలంగాణ నుంచి  ఏపికి వెళ్లే వారికి మాత్రమే ఈ స్థానికత వర్తిస్తుందని  పేర్కొంది. తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేస్తే వారిని ప్రాసిక్యూట్‌ చేస్తామని హెచ్చరించింది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో పాలనను హైదరాబాద్‌  నుంచి కొత్త రాజధానికి తరలిరచేరదుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు తమ పిల్లల భవిష్యత్‌ కోసం రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 371-డి సెక్షన్‌ను రద్దు చేయాలని కోరడం, దానిపై ఇటీవల సవరణ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ నుంచి  ఏపికి వెళ్లేవారంతా తెలంగాణ లో వారు ఉంటున్న  చిరునామా, ఏపికి వెళ్లాక అక్కడుండే చిరునామాలను కూడా సమర్పించాలి. ఇందుకు ఆధార్‌, రేషన్‌ కార్డు, డ్రైవిరగ్‌ లైసెన్స్‌, బ్యాంకు  పాస్‌బుక్‌, పాన్‌ కార్డు, ఓటర్‌ గుర్తింపు  కార్డుల్లో ఏదో ఒకదానిని సమర్పించాలని  నిర్దేశించింది.

ఏపి విద్యా సంస్థల్లో ప్రవేశం, లేదా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారు సొంతంగాను, మైనర్లయితే వారి తల్లిదండ్రులు ధ్రువీకరణ పత్రాలను సమర్పిరచాల్సి ఉంటుందని   పేర్కొంది . స్థానికత కోరుకునే వారు తహశీల్దార్ల ద్వారా సర్టిఫికేట్‌ పొందేందుకు ఫారం-1లో దరఖాస్తు చేసుకోవాలని, మీ-సేవా ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొంది . దరఖాస్తులు, ధ్రువీకరణ పత్రాలను పరిశీలించిన అధికారి డిజిటల్‌ సంతకంతో వారం రోజుల్లోగా స్థానికత సర్టిఫికేట్‌ జారీ చేస్తారని ప్రభుత్వం వెల్లడించింది.

అభ్యర్థులు సమర్పిం చే వివరాలను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, తప్పుడు సమాచారం అందించినట్లు వెల్లడైతే వారి ప్రవేశాలను రద్దుచేసి, ప్రాసిక్యూషన్‌ చేస్తామని ప్రకటించింది . రెండు ప్రొఫార్మాలను ప్రకటించడంతో పాటు, డిక్లరేషన్‌ నమూనా కూడా వెల్లడించింది. ప్రొఫార్మాలో మొబైల్‌ నంబర్లు, ఇ- మెయిల్‌, ఏ జిల్లాకు వెళ్లాలనుకుంటున్నారు, పుట్టిన తేదీ, ఎక్కడ పుట్టింది, దరఖాస్తుదారుని కులం, విద్యార్హ తలు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది . తహశీల్దార్‌ నుంచి  లభించే సర్టిఫికేట్‌కూ ప్రొఫార్మాను ప్రభుత్వం వేరుగా ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here