జగన్ బాబాయ్ ని గుర్తు చేసుకున్న లోకేష్..

Posted October 7, 2016

  lokesh angry jagan kl university classes
బాబుపై అలిగాడంటూ వచ్చిన వార్తలకి తెరదించే ప్రయత్నం చేశాడు చినబాబు.నాన్నతో విభేదాలు వచ్చాయంటూ సాగిన ప్రచారం మీద లోకేష్ జర్నలిస్ట్స్ ముందు మాట్లాడారు.వారితో చిట్ చాట్ చేస్తూ ఈ ప్రచారం చేసింది ఎవరో తెలుసంటూ పరోక్షంగా జగన్ మీద విరుచుకుపడ్డారు.నాన్నతో నాకు విభేదాలనడం జోక్ గా కొట్టిపడేశారు.జగన్ లా తండ్రికి తలవంపులు తేనని లోకేష్ చెప్పారు.జగన్ బాబాయ్ వై.ఎస్ .వివేకానంద రెడ్డి ని చినబాబు గుర్తుకు తెచ్చుకున్నారు.

అయన కడప ఎంపీ గా వున్నప్పుడు రాజీనామా చేయించి ఆ కుర్చీలో కూర్చోవాలని జగన్ తాపత్రయ పడ్డాడని లోకేష్ అన్నారు.పదవుల మీద నాకంత యావ లేదని చినబాబు చెప్పుకొచ్చారు.ఆరోగ్యం బాగాలేకే బ్రహ్మోత్సవాలు,దేశం శిక్షణా తరగతులకు దూరంగా ఉన్నట్టు వివరించారు.మొత్తానికి వివేకా ప్రస్తావనతో జగన్ కి గట్టి షాక్ ఇచ్చాడు లోకేష్.

SHARE