లోకేష్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ..ఆ భయమేనా?

 Posted [relativedate]

lokesh back bench siting tdp polit bureau meeting
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వాన నేడు జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఓ దృశ్యం అందరిలో ఆసక్తి రేపింది.సభ్యులంతా ముందు వరసలో కూర్చుంటే జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా వున్నా లోకేష్ వెనుక వరసకు పరిమితమయ్యారు.ఈసారి సమావేశంలో లోకేష్ కి మంత్రి పదవి విషయం కూడా చర్చకి వచ్చినట్టు తెలుస్తోంది.సభ్యులంతా ఇంకెందుకు ఆలస్యం లోకేష్ కి వెంటనే అవకాశం ఇవ్వొచ్చు అన్న తీరులోనే మాట్లాడినట్టు సమాచారం.ఇంత ముఖ్యమైన టాపిక్ జరుగుతున్నా లోకేష్ వెనుక వరసకు పరిమితం కావడం ..అవే ఫోటోలు ప్రెస్ కి విడుదల చేయడం ఓ వ్యూహం,భయం కూడా వుంది. ఇటీవల కె.ఎల్ యూనివర్సిటీ సమావేశంలో చినరాజప్ప ఎపిసోడ్ తర్వాత ఎక్కడ నుంచోవాలి?ఎక్కడ కూర్చోవాలి అన్న చిన్న విషయాల్లో కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో లోకేష్ కి అర్ధమైనట్టు వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here