లోకేష్ ని బుక్ చేసిన దేశం సీనియర్…

 Posted October 23, 2016

lokesh booked to chandrababu by senior
అమరావతి ..హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతున్న దేశం యువనేత నారా లోకేష్ కాళ్లకి బ్రేకులు పడ్డట్టే.ఇక అయన పూర్తి సమయం గుంటూరు లోనే ఉండబోతున్నారు.ఇందుకు సంబంధించి కొడుకు లోకేష్ కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఆలా లోకేష్ బుక్ కావడానికి కారణం ఏంటో తెలుసా? దేశం సీనియర్ నేత ఒకరికి అనుకున్న సమయానికి బాబు అపాయింట్మెంట్ దొరక్కపోవడమే.ఆ తరువాత ఓ సందర్భంలో ఆ నేత బాబుని కలిసి పార్టీ విషయమొకటి చెప్పారట.

ఇంతకుముందే చెప్పివుండాల్సిందని బాబు అనగానే ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని కలవలేకపోయినట్టు ఆ నేత బాబుతో అని …అంతటితో ఊరుకోకుండా లోకేష్ కోసం ప్రయత్నిస్తే అయన హైదరాబాద్ లో ఉన్నట్టు తెలిసిందని వివరించారట.దీంతో అయన వెళ్ళగానే లోకేష్ కి క్లాస్ పీకారట బాబు .ఇకపై గుంటూరు లోనే ఉండి పార్టీ సమస్యలపై వచ్చే నేతలందర్నీ కలవాలని గట్టిగా చెప్పడంతో లోకేష్ గుంటూరు కే బుక్ అయిపోయారు.

SHARE