అమరావతి రియల్ ఎస్టేట్ కి లోకేష్ బూస్ట్…

Posted April 13, 2017

lokesh boost to amaravtahi real estate
గుంటూరు …విజయవాడ మధ్య అమరావతిలో రాజధాని ప్రకటనతో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా ఊపందుకుంది.అయితే ఆ తర్వాత పరిస్థితులతో అంతే వేగంగా కిందకు పడిపోయింది .పెద్ద నోట్ల రద్దు కన్నా ముందే crda పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బ తింది. అందుకు కారణం …crda పరిధిలోని గ్రామాల్లో లే అవుట్లు ,నిర్మాణాలకు స్థానిక సంస్థల అనుమతులు ప్రభుత్వం గతంలో ఆదేశాలిచ్చింది.ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న భూమి ధరలు దీని వల్ల కంట్రోల్ అవుతాయని అప్పట్లో ప్రభుత్వం భావించింది.అయితే ఆ నిర్ణయానికి,పెద్ద నోట్ల రద్దు కూడా తోడు కావడంతో రియల్ ఎస్టేట్ రంగం రాజధాని చుట్టుపక్కల పడకేసింది.దీని ప్రభావం రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం మీద కూడా పడింది.

ఒక్క గుంటూరు జిల్లానే చూసుకుంటే మొత్తం 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వున్నాయి.గుంటూరు డీఆర్ పరిధిలో 8 , తెనాలి పరిధిలో 11 ,నరసారావు పేట పరిధిలో 13 కార్యాలయాలు వున్నాయి.గడిచిన అక్టోబర్ నాటికి అంటే ఏడు నెలల కాల వ్యవధిలో రిజిస్ట్రార్ కార్యాలయ ఆదాయ లక్ష్యం 431 కోట్ల రూపాయలు..వచ్చింది మాత్రం 319 కోట్లు మాత్రమే. ఇలాగే వదిలిపెడితే ఆదాయం తగ్గడం మాట అటుంచి crda పరిధిలో అభివృద్ధి ఆగిపోతుందని టీడీపీ సర్కార్ కి అర్ధమైంది.

లోకేష్ పంచాయితీరాజ్ ,గ్రామీణ అభివృద్ధి శాఖ పగ్గాలు అందుకున్నాక crda పరిధిలోని గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.ఆ గ్రామాల్లో ప్రజలు భూముల ధరలు పెరిగాయన్న సంతోషాన్ని సర్కార్ నిర్ణయం నీరు కారుస్తోందని లోకేష్ అర్ధం చేసుకున్నారు.పైగా ఈ గ్రామాలు ఎంత స్పీడ్ గా డెవలప్ అయితే అమరావతి కి కూడా మంచిదని లోకేష్ భావించారు.దీంతో గతంలో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించారు.ఈ నిర్ణయం వల్ల crda పరిధిలోని గుంటూరు జిల్లాకి సంబంధించి 250 నుంచి 300 గ్రామాల్లో లే ఔట్లు,నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే .దీంతో ఒక్కో పంచాయితీకి దాదాపు 2 కోట్ల ఆదాయం వస్తుందని ఓ అంచనా.అదే నిజమైతే మళ్లీ crda లో రియల్ ఎస్టేట్ ఎంతోకొంత ఊపందుకోవడం ఖాయం.ఇదంతా లోకేష్ పుణ్యమని కొందరు అంటే మంగళగిరి వార్డ్ ఉప ఎన్నిక సమీక్షలో ఇదో కారణమని తేలడమే కారణమని ఇంకొందరు అంటున్నారు.కారణమేదైనా crda లో రియల్ ఎస్టేట్ మళ్లీ జోరు అందుకోవడం ఖాయమనిపిస్తోంది.

SHARE