పెద్దమ్మ కోసం చినబాబు ..

0
559
lokesh ideas for purandeswari

Posted [relativedate]

lokesh ideas for purandeswari
దగ్గుబాటి పురందేశ్వరిని వైసీపీ లోకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సంకేతాలు రావడంతో చినబాబు లోకేష్ అలెర్ట్ అయ్యారంట.నారా..దగ్గుబాటి కుటుంబాల్ని ఒకే రాజకీయ వేదిక మీదకి తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగి విఫలమైన విషయం తెలిసినా మరోసారి ట్రై చేయడంలో తప్పు లేదని లోకేష్ భావిస్తున్నారట.అయితే అత్యంత కష్టమైన,క్లిష్టమైన ఈ పని బాధ్యత ఎవరికి అప్పగించాలన్నదానిపై తర్జనభర్జన పడుతున్నారట.ప్రస్తుతానికి భార్య బ్రాహ్మణి,మామ బాలకృష్ణ లలో ఒకరిని ప్రయోగిస్తే ఎలా ఉంటుందో అని లోకేష్ ఆలోచిస్తున్నారట. ఈ వ్యవహారంలో మరో ఆశ్చర్యకరమైన వ్యక్తి గురించి కూడా తెలుస్తోంది.ఆమె చంద్రబాబు భార్య భువనేశ్వరి.సోదరి భువనేశ్వరితో మాటామంతి లేని భువనేశ్వరి ఈ బాధ్యత ఎలా తీసుకుంటారనేగా ఆశ్చర్యం..కానీ విశాఖలో ఉంటున్న పురందేశ్వరి కుమార్తె నివేదిత తో భువనేశ్వరికి మంచి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.ఈ కోణంలో ఓ ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందోనని కూడా లోకేష్ అనుకుంటున్నారు.ఇలా కుటుంబం నుంచి ప్రయత్నం జరిగిందో లేదో కానీ లోకేష్ మనసులో మాట తెలుసుకున్న ఓ టీడీపీ నేత ఈ బాధ్యత తానే తీసుకుంటానని ముందుకొచ్చినట్టు సమాచారం.

ఒకప్పుడు దగ్గుబాటి వర్గంలో ఉండి కాలానుగుణంగా మళ్లీ చంద్రబాబు చెంతకు చేరిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు స్వయంగా పురందేశ్వరిని కలిసి మాట్లాడేందుకు ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే లోకేష్ ఎన్ని ఆలోచనలు చేసినా,ఎంతగా ప్రయత్నించినా దగ్గుబాటి దంపతులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ముఖ్యం.ఇటీవల ఆ దంపతులు అంతకుముందు లాగా చంద్రబాబు మీద దూకుడుగా మాట్లాడ్డం కొంత తగ్గినా అది సానుకూల సంకేతం అనుకోలేం.ఆ సంయమనం వ్యూహాత్మకం కూడా కావొచ్చు.ఏదేమైనా పెద్దమ్మ కోసం చినబాబు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

Leave a Reply