బాబు మంత్రి వ‌ర్గంలోకి లోకేశ్!!

0
477
lokesh in chandrababu ministry

Posted [relativedate]

lokesh in chandrababu ministry
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ చ‌ట్ట‌స‌భ‌లోకి అడుగు పెట్టనున్నారా? త‌్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌రిలో ఆయ‌న దిగ‌నున్నారా? ఇక ఆయ‌న మంత్రి కావ‌డం లాంఛ‌న‌మేనా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది టీడీపీ శ్రేణుల నుంచి.

ఏపీలో త్వ‌ర‌లో 22 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలున్నాయి. 22 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎమ్మెల్యేల కోటా నుంచి ఏడు సీట్ల‌కు ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం శాస‌న‌స‌భ‌లో ఉన్న సంఖ్యా బ‌లాన్ని బ‌ట్టి చూస్తే… టీడీపీకి ఆరు.. వైసీపీకి ఒక ఎమ్మెల్సీ సీటు ద‌క్కే అవ‌కాశ‌ముంది. కాబ‌ట్టి లోకేశ్ ఎన్నిక లాంఛ‌న‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

లోకేశ్ కు ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యేగా కావాల‌నే ఆకాంక్ష ఉంద‌ట‌. అయితే ప్ర‌స్తుతం అసెంబ్లీ స్థానాలు ఖాళీగా లేవు. ఎవ‌రైనా రాజీనామా చేస్తే త‌ప్ప ఆయ‌న ఎన్నిక‌య్యే అవ‌కాశాలు లేవు. అయితే లోకేశ్ కోసం రాజీనామా చేయ‌డానికి చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి ముందుకొచ్చార‌ట‌. కానీ అది వ‌ర్క‌వుట్ కాద‌ని ప‌క్క‌న బెట్టేశార‌ట‌. ఎందుకంటే ప‌ల‌మ‌నేరు నియోజ‌క‌వ‌ర్గం… బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం ప‌క్క‌నే ఉంది. ఇలా ఇద్ద‌రూ ప‌క్క ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఉంటే… రాంగ్ సిగ్న‌ల్స్ వెళ్లే ప్ర‌మాద‌ముంది. అందుకే ఈ ప్ర‌తిపాద‌న వ‌ర్క‌వుట్ కాద‌ని తేల్చేశార‌ట‌.

ఇక కోస్తా నుంచి కూడా కొంత‌మంది ఎమ్మెల్యేలు లోకేశ్ కోసం ముందుకొచ్చార‌ట‌. అయితే ఇప్పుడు రాజీనామా చేయ‌డం.. అది పెద్ద వార్త కావ‌డం… బాబుకు ఇష్టం లేద‌ట‌. అందుకే ఎమ్మెల్సీకి మాత్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. అయితే టీడీపీ పెద్ద‌లు మాత్రం ఎమ్మెల్సీతోనే స‌రిపెట్ట‌కుండా… లోకేశ్ కు మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వాల‌ని కోరార‌ట‌.
ఎందుకంటే పార్టీ ప‌రంగా లోకేశ్ గ‌త కొంత‌కాలంగా చాలా చురుగ్గా ఉన్నారు. జిల్లాల్లో ప‌ర్య‌టిస్తూ పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా యువ‌నేత‌కు మినిస్ట్రీ ఇస్తే… యువ‌త‌లోనూ పార్టీకి మంచి మైలేజ్ వ‌స్తుంద‌ని బాబుగారికి సూచించార‌ట‌.

టీడీపీ సీనియ‌ర్ల స‌ల‌హాతో చంద్ర‌బాబు కూడా ఏకీభ‌వించిన‌ట్టు స‌మాచారం. మంత్రిప‌ద‌వి ఇవ్వ‌డానికి సానుకూలంగానే ఉన్నార‌ని స‌మాచారం. సో.. ఆయ‌న ఎమ్మెల్సీ కావ‌డం.. ఆ త‌ర్వాత మినిస్ట‌ర్ అయిపోవ‌డం అన్నీ త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయ‌ని అమ‌రావ‌తిలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది నిజ‌మో ..కాదో తెలియాలంటే ఒక్క నెల ఓపిక ప‌డితే చాలు..!!!

Leave a Reply