టీ నేతల దగ్గర లోకేష్ గుట్టు విప్పిన బాబు..

0
267
lokesh into ap cabinet entry

Posted [relativedate]

lokesh into ap cabinet entryతెలంగాణ తెలుగు దేశం నేతలకి తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ భవిష్యత్ ఏమిటో అర్ధమైపోయింది.వారితో ఆ లోగుట్టు విప్పింది మరెవరో కాదు.సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే.తెలంగాణ టీడీపీ నేతలతో అర్దరాత్రి దాకా బాబు సమావేశమయ్యారు. తెలంగాణాలో టీడీపీ కి పూర్వవైభవం తీసుకురావడానికి అనుసరించాల్సిన వ్యూహం మీద ఈ భేటీలో సుదీర్ఘ చర్చలు జరిపారు.ఆ టైం లో ఓ నాయకుడు ఏదైనా సమస్య వస్తే లోకేష్ తో మాట్లాడతామని రెండుమూడు సార్లు అనడంతో చంద్రబాబు సరే అని ఊరుకోకుండా ఓ విషయం బయటపెట్టారు.

త్వరలో తలపెట్టిన మంత్రివర్గ విస్తరణలో లోకేష్ ని క్యాబినెట్ లోకి తీసుకోబోతున్నట్టు చంద్రబాబు టీ టీడీపీ నేతలకి స్పష్టం చేశారట.దాంతో మున్ముందు లోకేష్ ఏపీలో పాలన,పార్టీ వ్యవహారాల్లో బిజీ గా వుండే అవకాశం ఉందని …అందువల్ల మరీ ముఖ్యమైన విషయం అయితే తప్ప ప్రతి చిన్న దానికి లోకేష్ దగ్గరకి వెళ్ళొద్దని బాబు వారితో సూచనప్రాయంగా చెప్పారట.ఇకపై తెలంగాణాలో పార్టీ అంశాలపై స్థానిక నేతలే చొరవ తీసుకుని పోరాడేలా వ్యవస్థాగత వ్యూహాన్ని అమలు చేయాలని కూడా బాబు వారికి ఉద్భోదించారట.

లోకేష్ మంత్రి అవుతున్నందుకు సంతోషంగా ఉన్నప్పటికీ ఇకపై ఆయన సేవలు విరివిగా ఉపయోగించుకోలేమన్న వార్త టీ టీడీపీ నేతలకి మింగుడు పడడం లేదు.ఇప్పటికే చంద్రబాబు సమయం దొరకడం గగనం అవుతుంటే …ఇప్పుడు లోకేష్ కూడా బిజీ అయితే ఎలా అని కంగారుపడుతున్నారట.వారి మనోభావాలు పసిగట్టిన బాబు మరీ ఇబ్బంది పడాల్సింది ఏమీలేదని చెప్పి వారిని ఊరడించారట.ఇంతలో ఓ నాయకుడు బ్రాహ్మణి ప్రస్తావన తెచ్చినప్పుడు..అవసరమైతే ఆమె కూడా రాజకీయాల్లో అడుగు పెడుతుందని చెప్పారట.

Leave a Reply