లోకేష్ ని ట్రాక్ తప్పిస్తున్నారు..

0
556
lokesh is being hypnotised

Posted [relativedate]

lokesh is being hypnotised
రాజకీయాల్లో ఒక్కో నాయకుడిది ఒక్కో శైలి.ఆ వ్యవహారశైలి వల్ల కొందరు అభిమానిస్తారు. ఇంకొందరు వ్యతిరేకిస్తారు.కానీ ఆ నేత అస్తిత్వాన్ని కాపాడేది ఆ శైలి మాత్రమే.అదే వారి బలం. ఉదాహరణకి వై.ఎస్,చంద్రబాబు పద్ధతుల్ని ఓ సారి చూద్దాం.చంద్రబాబు మీద కష్టపడతాడు, ఏదో రకంగా అభివృద్ధి సాధిస్తాడని సామాన్య అభిప్రాయం.2004 లో బాబు ఓడిపోయాక వై.ఎస్ అధికార పగ్గాలు చేపట్టారు.ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినా ఇంతకుముందెన్నడూ లేనంతగా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారు.వై.ఎస్ దూకుడు కొందరికి నచ్చితే,ఆయన సర్కార్ లో అవినీతి ఇంకొందరికి నచ్చలేదు.కానీ 2009 లో వై.ఎస్ ప్రాభవానికి గండి కొట్టాలని తన సహజ ధోరణికి భిన్నంగా చంద్రబాబు నేరుగా బ్యాంకు లో డబ్బులు వేస్తామని చెప్పినా గెలుపు దక్కలేదు. వై.ఎస్ పధకాల లబ్ధిదారులు ఆయనతోనే వున్నారు.ఇక బాబు నుంచి అందుకు భిన్నమైన రాజకీయం ఆశించిన వాళ్ళు కూడా నిరాశపడ్డారు.ఫలితంగా 2009 లో కూడా బాబు ఓడిపోయారు. ఇక 2014 కొత్తరాష్ట్రాన్ని బాబు అభ్భివృద్ధి చేయగలరని నమ్మి జనం ఓట్లు వేశారు.
ఇలా రాజకీయంగా ఏ క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఓ నాయకుడి అస్తిత్వానికి బలమైన పునాదిగా వుండే ఇమేజ్ కి తగ్గట్టే వ్యవహరించాలి.మార్పు అవసరమైనప్పుడు నిజాయితీగా జనానికి చెప్పి ఒప్పించాలి తప్ప వేరే మార్గాలతో ప్రయోజనం ఉండదు.ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే ఇప్పుడిప్పుడే బాబు వారసుడిగా ఎదగాలని కలలు కంటున్న లోకేష్ బుడిబుడి అడుగుల గురించి తప్పటడుగులు పడుతున్నాయని హెచ్చరించడానికే..
లోకేష్ ప్రత్యర్థి జగన్ ఇప్పటికే రాజకీయంగా నిలదొక్కుకున్నాడు.వ్యక్తిత్వపరంగా ఎన్ని లోపాలున్నా దూకుడే ఆయన మంత్రం,బలం.కొండనైనా డీకొడతాడు అన్న ఇమేజ్ జగన్ రాజకీయ జీవితానికి పునాది.ఆయన్ని ఎదుర్కోడానికి ఇప్పుడు లోకేష్ సిద్ధమవుతున్నాడు.ఎమ్మెల్సీ అయినట్టే ..ఇకరేపోమాపో క్యాబినెట్ లోకి కూడా అడుగుపెడతాడు. ఆయన మంత్రి అయినా ఓ విషయాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి.లోకేష్ ఇప్పటికీ తండ్రి చాటు బిడ్డే.రాజకీయంగా ఆయన ఇదీ అని చెప్పుకునే బలమైన ముద్ర ఇప్పటిదాకా పడలేదు.జగన్ కి భిన్నమైన రాజకీయ వైఖరి..అది కూడా ప్రజామోదం ఉండేలా లోకేష్ చూసుకోవాలి.
ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంలోలోకేష్ మాటలు ఓ సాదాసీదా రాజకీయ నేతని తలపించాయి తప్ప ఓ కొత్త తరం నేతని ప్రొజెక్ట్ చేసేలా లేవు.ఇక ఆయన ఆస్తుల గురించి సాక్షి విమర్శలకి కౌంటర్ గా లోకేష్ స్పందించిన తీరు సర్వసాధారణం.నిజానికి ఏటా ఆస్తులు ప్రకటించే అంశాన్ని ఆసరాగా చేసుకుని నీ ఆస్తులు ప్రకటించు అని జగన్ ని తీవ్ర స్థాయిలో నిలదీయొచ్చు.మీడియా వార్తలు చూస్తే లోకేష్ ఆస్తుల విలువ పెంపుకి వచ్చిన ప్రాధాన్యం ఆయన ఇచ్చిన కౌంటర్ కి రాలేదు.ఇక ఓ కుర్ర నాయకుడు ఇదే విషయంలో జగన్,లోకేష్ ని పోలుస్తూ ఓ లేఖ రాశాడు. అందులో జగన్ అవినీతిపరుడు,జైలుకెళ్లాడు అని చెప్పి ,లోకేష్ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినట్టు చూపించారు. అదే లేఖలో లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ప్రభుత్వాన్ని లోకేష్ సంసిద్ధం చేసినట్టు చెప్పుకొచ్చారు.స్టాన్ ఫోర్డ్ లో చదివిన మేధావి వృద్ధులకు ఇచ్చినట్టు యువకులకు భృతి ఇవ్వడానికి ఒప్పుకోరు.వారికి ఉద్యోగాల కల్పనకు ప్రయత్నిస్తారు.ఇటీవల HCL కంపెనీ ఏపీ లో డెవలప్మెంట్ సెంటర్ పెడతామని,5 వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. వీలైతే అలాంటి ప్రకటన వెనుక లోకేష్ కృషి ఉందని చెప్పాలి గానీ కొత్త తరం నేతకి పాత ఇమేజ్ అంటగడితే ఏ ప్రయోజనం ఉండదు.అధికారం వుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఆ ప్రభావం తెలియకపోవచ్చు.కానీ బూజు పట్టిన పద్ధతుల వైపు ట్రాక్ మారుతున్న విషయాన్ని లోకేష్ లేదా చంద్రబాబు ఇప్పటికైనా గ్రహించి నవీన ఆలోచనల వైపు అడుగులేయాలి.సరికొత్త ఇమేజ్ సృష్టించుకోవాలి.లేదా పాత చింతకాయ పచ్చడి లా రుచి బాగున్నా తినే వారు పెద్దగా వుండరు. ఈ విషయాన్ని లోకేష్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మేలు

Leave a Reply