Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోకంపోకడ బహు చిత్రం.ఏ పిల్లవాడైనా సరిగ్గా చదవకుండా స్కూల్ కి లేదా పరీక్షకి వెళ్లాలంటే భయపడతాడు.మాష్టారు ఏమంటారో అని భయపడతారు.అదే ఆ పాఠం సరిగ్గా చదవని విద్యార్థి ఏ పీఎం కొడుకో,సీఎం కొడుకో అయితే అప్పుడు భయం శిష్యుడికి కాదు గురువుకి.ఇప్పుడు పాపం ఓ మాష్టారికి అలాంటి కష్టమే వచ్చింది. ఆ డీటెయిల్స్ ఏమిటో చూద్దాం.టీడీపీ యువనేత లోకేష్ తెలుగు భాష మీద పట్టుతో మాట్లాడలేకపోతున్నారని తరచుగా వినిపిస్తున్న మాట.అయితే దానికి ప్రధాన కారణం మొదటినుంచి ఇంగ్లీష్ మీడియం లో చదవడం.అయితే ఆ బలహీనతని అధిగమించడం కోసం లోకేష్ ఎప్పటినుంచో కసరత్తు చేస్తున్నారు.తెలుగు భాష,ప్రసంగాల మీద పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.ఈ ప్రయత్నంలో ఆయనకు గురువుగా వ్యవహరిస్తోంది ఎవరో తెలుసా ? పేరు పెద్ది రామారావు.పూర్వాశ్రమంలో సుప్రభాతం అనే పత్రికలో జర్నలిస్ట్.నాటకరచయిత.తర్వాత అదే థియేటర్ ఆర్ట్స్ కి సంబంధించి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు.ఇలా ఎన్ని విషయాలు ఆయన గురించి చెప్పినా ఆయనంటే ఇంటరెస్ట్,గుర్తు రావడం లేదా?అయితే కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు మీకోసం .
2009 ఎన్నికల్లో ప్రచార పర్వాన్ని ఉర్రూతలు ఊగించిన ఎన్టీఆర్ కి సహకారం అందించింది ఈ పెద్ది రామారావే. సినిమా నటుడు రాజీవ్ కనకాలకి బావ అవుతాడు.రాజీవ్ చెల్లిని ఈయన వివాహం చేసుకున్నారు.నటులకు శిక్షణ ఇచ్చే దేవదాస్ కనకాల దంపతులకి అల్లుడు.ఇలా చెప్తే బాగా అర్ధమైంది కదా.కొన్నాళ్లుగా ఈయన లోకేష్ కి సన్నిహితంగా వుంటూ తెలుగుకి,ప్రసంగాలకు సంబంధించిన సలహాలు ఇస్తూ వస్తున్నారు.అయితే ఇప్పుడు లోకేష్ మీద వస్తున్న విమర్శలు ఆయన్ని టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది.విద్యాభ్యాసం చేసేది గురుకులమైనా యువరాజుకు చెప్పడంలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయా?