వై.ఎస్.ఆత్మని లోకేష్ పలకరించాడా?

 lokesh meets ys rajashekhar reddy soul friend kvp ramachandra rao
ఆంధ్రప్రదేశ్ లో మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు,వై.ఎస్ ల మధ్య రాజకీయ వైరం ఆ ఇద్దరిటైం లోనే వ్యక్తిగత పోరాటంగా మారింది.వైఎస్ మరణించి జగన్ కొత్త పార్టీ పెట్టాక పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది.ఇటీవల గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమంలో బాబు,జగన్ ఎదురు పడితే ఏమైందో చూశాం.మూడో పెద్దమనిషి కలగచేసుకుంటే గానీ కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేని పరిస్థితి.అదే సీన్ లో లోకేష్ ఉంటే ఎలా ఉండేది?అసలే అధికారం …ఆ పై అనుభవరాహిత్యం …పెద్దగా పరిణితిని ఊహించలేము.అయితే గన్నవరం విమానాశ్రయంలో జరిగినట్టు చెప్పుకుంటున్న ఓ విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది.

గన్నవరం విమానాశ్రయంలోవై.ఎస్ ఆత్మగా చెప్పుకునే కె.వి.పి.రామచంద్ర రావు కి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఎదురుపడ్డారు .ఏమి జరుగుతుందా అని పక్కనోళ్లు ఆలోచించే లోపే లోకేష్ చొరవగా ఆయన్ను అంకుల్ ఎలా వున్నారని పలకరించారట.అయన కూడా తిరిగి యోగక్షేమాలు అడిగినట్టు తెలుస్తోంది .అయితే విషయం అంతటితో ఆగలేదు ఆ ఇద్దరు ముఖాముఖీ ఐదు నిమిషాలకి పైగా మాట్లాడుకొన్నట్టు బయటకి వచ్చింది .

అవి కేవలం పుకార్లని లోకేష్ సన్నిహితులు అంటున్నారు.అక్కడే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఉండటంతో ఆయనకి సంబంధించిన బార్ కేసు గురించి మాట్లాడి ఉండొచ్చని ఓ టాక్ .విష్ణు పార్టీ మారడానికి లోకేష్ తో సంప్రదింపులు జరిపాడని మరో టాక్.ఏదేమైనా వై.ఎస్ ఆత్మని లోకేష్ పలకరించడం ఓ సంచలనం అయ్యింది.రాజకీయ వైరం ఉన్నంత మాత్రాన కనీసం మనిషిని మనిషి పలకరించుకోలేని పరిస్థితి అవసరమా ?

SHARE