అమ్మయ్య లోకేష్ అలగలేదు.

Posted October 7, 2016

 lokesh no sad feeling attend kl university classes
తెలుగు తమ్ముళ్ళకి ఓ చింత తీరింది.కె .ఎల్ యూనివర్సిటీ లో సాగుతున్న టీడీపీ వర్క్ షాప్ తొలి రెండు రోజులు చినబాబు రాకపోవడంతో అయన అలిగారంటూ సోషల్ మీడియా కోడై కూసింది.మంత్రి పదవి ఇవ్వకపోవడంతో బాబు మీద చినబాబు అలిగారని ఓ సెక్షన్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతో తప్పనిసరిగా మూడో రోజు సమావేశాలకు లోకేష్ వచ్చారు.మెడనొప్పికి చికిత్స తీసుకోవడం వల్ల వర్క్ షాప్ కి రాలేకపోయినట్టు లోకేష్ అందరికీ చెప్పాల్సి వచ్చింది.

లోకేష్ కనపడగానే అలక వార్తలు నిజం కాదని తమ్ముళ్లు పక్కకి చేరి గుసగుసలాడుకోవడం కనిపించింది.వచ్చినా రాకపోయినా చర్చ తప్పదని లోకేష్ కి వెంటనే అర్ధమైంది.అంతే మరి…ఫోకస్ లైట్స్ వెలుగులో ఉండటం అన్నిటికన్నా కష్టం.

SHARE