ఈనెల 28న లోకేశ్ నామినేష‌న్?

0
490
lokesh nomination as mlc on 28th february

Posted [relativedate]

lokesh nomination as mlc on 28th february
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు, యువ‌నేత లోకేశ్ కు మంత్రిప‌ద‌వి ఖాయ‌మ‌ని తేలిపోయింది. అయితే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తారా…? లేక ఏదైనా స్థానాన్ని ఖాళీ చేయించి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారా? అన్న అనుమానాలుండేవి. ఇప్పుడు అందులోనూ క్లారిటీ వ‌చ్చేసింది. లోకేశ్ ఎమ్మెల్సీగా పోటీ చేయ‌బోతున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

తూర్పు గోదావ‌రి స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్సీగా బొడ్డు భాస్క‌ర రామారావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈయ‌న ప‌ద‌వీకాలం పూర్త‌య్యింది. ఖాళీ అవుతున్న ఈ స్థానంలో మ‌రోసారి త‌న‌కే అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నారు. అయితే ఆయ‌న‌కు రెన్యువ‌ల్ ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదే స్థానాన్ని చాలామంది ఆశిస్తున్నారు. అయితే ఒకే దెబ్బ‌తో అన్ని పిట్ట‌ల‌ను కొట్టేసేందుకు చంద్ర‌బాబు ప‌క్కా ప్లాన్ వేశారు. త‌న త‌న‌యుడు లోకేశ్ ను తూర్పుగోదావ‌రి జిల్లా స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దింపాల‌ని డిసైడ‌య్యార‌ట‌. దీంతో ఆశావ‌హుల్లోనూ అసంతృప్తి ఉండ‌దు. అంద‌రూ లోకేశ్ విజ‌యానికి కూడా శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తారు.

తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి ఎమ్మెల్సీ బ‌రిలోకి దిగేందుకు కూడా లోకేశ్ కూడా అంగీక‌రించార‌ని టాక్. అంతేకాదు ఈనెల 28న నామినేష‌న్ వేయ‌బోతున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఈ ఎన్నిక‌లు మార్చి 17న జ‌ర‌గ‌బోతున్నాయి. అయితే ఈ ఎన్నిక‌ల్లో లోకేశ్ గెలుపు న‌ల్లేరు మీద న‌డకేనంటున్నాయి టీడీపీ వ‌ర్గాలు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈజీ విక్ట‌రీతో… మంత్రివ‌ర్గంలోకి లోకేశ్ గ్రాండ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారా? అని టీడీపీ క్యాడ‌ర్ ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. మ‌రి వారి ఆశ నెర‌వేరుతుందా… ? లేదా? అన్న‌ది త్వ‌ర‌లోనే తేలిపోనుంది.

Leave a Reply