యువభేరి సహా వివిధ వేదికలపై హోదా ప్రయోజనాలు వివరించడానికి వైసీపీ ట్రై చేస్తుండటంతో లోకేష్ కౌంటర్ ఎటాక్ మొదలెట్టారు.ఎప్పటిలాగానే సోషల్ మీడియా వేదికగా జగన్ ని టార్గెట్ చేశారు. యువభేరిని ఉద్దేశించి జగన్ మీద సెటైర్ పేల్చాడు.’ఈయన కళాశాలలకు వెళ్లి విలువలు గురించి చెప్తాడు.. అక్కడనుంచి అవినీతి కేసులపై కోర్టుకి హాజరవుతారు…ఎంత హాస్యాస్పదం?’….ఇదీ జగన్ మీద లోకేష్ కామెంట్ .
ఇక టీడీపీ అధికారిక ఫేస్ బుక్ వేదికగా కూడా లోకేష్ చెలరేగిపోయాడు.’ ఈయన గారు సుద్దులు చెబుతాడు గానీ పాటించడు.యువతరానికి అయన అవసరం లేదు’..ఇలా లోకేష్ నెటిజెన్ లకు మాత్రమే పరిమితమైతే చేరాల్సిన విషయం చేరేటప్పటికి చాలా సమయం పడుతుంది.అసలు టార్గెట్ అవుతున్న జగన్ కూడా లోకేష్ ని పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు.అయన దృష్టంతా సీఎం పీఠం మీదున్న చంద్రబాబు పైనే ..