టిడిపి నేతలకు లోకేష్ హెచ్చరిక….

Posted October 6, 2016

 lokesh speech kl university warning tdp leaders

కార్యకర్తలను పట్టించుకోని నాయకులను పార్టీ కూడా పట్టించుకోవదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.గుంటూరు జిల్లాలో కోనేరు లక్ష్మయ్య కాలేజీలో జరుగుతున్న టిడిపి నేతల శిక్షణ శిబిరంలో ఆయన ప్రసంగించారు. కార్యకర్తల సంక్షేమానికి టిడిపి తీసుకుంటున్న వివిధ చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. నాయకుల పనితీరును పార్టీ పరిశీలిస్తోందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరి పనితీరుకు సంబందించిన నివేదికలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళుతున్నాయని అన్నారు. తనతో సహా ఎవరి కైనా పనితీరును బట్టి పదవులు వస్తాయని,సీట్ల కేటాయింపు జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను నేతలు సమర్ధంగా తిప్పికొట్టాలని లోకేష్ సూచించారు.

lokesh-at-kl-university lokesh-at-kl-university-2lokesh-at-kl-university-1

SHARE