లోకేష్ vs జగన్ …తుస్ మనిపించారే..

0
275
lokesh vs jagan flop

Posted [relativedate]lokesh vs jagan flopరాష్ట్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకి సిద్ధం …టైం,ప్లేస్ నువ్వే డిసైడ్ చేసుకో …ప్రతిపక్ష నేత జగన్ కి లోకేష్ విసిరిన సవాల్ . గుంటూరు జిల్లా యడ్లపాడు కేంద్రంగా లోకేష్ విసిరిన సవాల్ ని ఓ అవకాశంగా మార్చుకుని బాబు వైఫల్యాల్ని జగన్ ఎండగడతాడని వైసీపీ శ్రేణులు భావించాయి.అలా జరగాలని కోరుకున్నాయి.అయితే వారి ఆశల మీద జగన్ నీళ్లు చల్లారు. అయన ఎక్కడా లోకేష్ సవాల్ మీద మాట్లాడలేదు.సరే ..టైం వుంది అనుకుంటుంటే ఇంతలో రంగంలోకి దిగారు వైసీపీ స్పాక్స్ పర్సన్ అంబటి.వైసీపీ అభిమానుల ఆశల్ని నీరుకారుస్తూ లోకేష్ మీద చెలరేగిపోయాడు.

లోకేష్ రాజకీయాల్లో ఇంకా చిన్నపిల్లోడే..శిక్షణ దశలో వున్నాడు.ప్రతిపక్ష నేతని చర్చకు పిలిచే అంత పెద్దవాడు కాలేదు ..లోకేష్ ఆ దశకి ఎప్పటికీ రాలేడు..దమ్ముంటే ఓ నియోజకవర్గంలో పోటీ చేసి నాలుగు ఓట్లు సంపాదించాలి.ఆ తరువాతే రాజకీయాల గురించి మాట్లాడాలి.అసలు లోకేష్ బుర్ర ఇంకా పెరగలేదు ……..ఇలా సాగింది లోకేష్ మీద అంబటి పురాణం.అయితే లోకేష్ సవాల్ ని జగన్ స్వీకరిస్తే ఆ మజా వేరని భావించిన వైసీపీ కార్యకర్తలే తుస్సుమనిపించారే అంటూ అంబటి మీద ఫైర్ అయిపోతున్నారు.

Leave a Reply