లోకేష్ తర్వాత బ్రాహ్మణి..

Posted October 13, 2016

 lokesh wife brahmani do survey tdp elections assembly seats
ఏపీ హోమ్ మంత్రి చినరాజప్ప అంశంలో లోకేష్ ని దోషిని చేయడానికి ప్రయత్నించి విఫలమైన వైసీపీ,దాని అనుకూల సోషల్ మీడియా ప్రతినిధులు ఇప్పుడు బ్రాహ్మణి పేరు తెర మీదకు తెచ్చారు. ఆమె దగ్గరుండి జరిపించిన సర్వే లో టీడీపీ కి కేవలం 57 స్థానాలు మాత్రమే వస్తాయని తేలిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉచిత శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ లోప్రారంభించిన సందర్భంలో ఫోటోలు చూపిస్తూ తాజా కధనాన్ని ప్రచారం చేస్తున్నాయి.ఇలా జరగడం కొత్తేమీ కాదు.గడిచిన రెండున్నరేళ్లలో ఇలా ఏదో ఒక పేరు చెప్పి సర్వేల వివరాల్ని వైసీపీ వర్గాలు బయటికి వదులుతూనే వున్నాయి.అన్నిటికన్నా వింతేమిటంటే ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోపే ఇలాంటి సర్వే వివరాలు బయటికి రావడం …ఈ ప్రభుత్వం రెండేళ్ల కన్నా ఉండదని సాక్షాత్తు ప్రతిపక్షనేతే చెప్పడం.

అయితే ఇలా లీకుల ద్వారా సర్వే వివరాల్ని వెల్లడి చేస్తున్న వాళ్ళు ఒక్క సందర్భంలో అయినా వైసీపీ మెజారిటీ సీట్లు గెలుస్తుందని చెప్పలేకపోతున్నారు.టీడీపీ బలం తగ్గింది దాని వల్ల ప్రతిపక్షానికి ఉపయోగం అని తప్ప ..ఒక్కసారైనా ప్రజాక్షేత్రంలో వైసీపీ శక్తి పెరిగిందని చెప్పలేకపోయారు.అంటే ఈ ప్రచారం చేసే వాళ్లకి కూడా వైసీపీ,జగన్ శక్తిసామర్ధ్యాల మీద నమ్మకం లేదన్నమాట.తన మనసులో కోరికని జనంతో నమ్మించడానికి బ్రాహ్మణి పేరు కూడా బయటికి తెచ్చారు. ఎన్నికలు,కుర్చీ కోసం తహతహలాడేవారు ఓ విషయం గుర్తుంచుకోవాలి.కోడి కూసింది అని తెల్లవారిపోదు …తెల్లవారాకే కోడి కూయాలి..ఇంత సింపుల్ లాజిక్ మిస్ అయితే రాజకీయాలు ఎలా చేస్తారో ? గెలుపులా వస్తుందో?

SHARE