లోకేష్ కి అభయం..జనం చెవిలో పుష్పం

0
555
lokesh won the elections

Posted [relativedate]

lokesh won the elections
కె.ఏ పాల్ ఒకప్పుడు మీడియాలో ఎంతగా వెలిగిపోయాడో చూశాం.కానీ కాలం ఎదురు తిరిగాక ఛార్టర్డ్ ఫ్లైట్ లో దేశాల చుట్టి వచ్చిన పాల్ ఆ మధ్య హత్య కేసు లో ముద్దాయిగా నిలుచోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఆయన హఠాత్తుగా స్టేట్ పొలిటికల్ సీన్ లోకి ఓ కామెంట్ తో ఎంట్రీ ఇచ్చాడు.టీడీపీ శ్రేణులు తమ భుజాన మోస్తున్న లోకేష్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగడం ఆయనకు నచ్చలేదట.అందుకే ఆయన లోకేష్ కి గెలుపు అభయం ఇస్తూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ కి దిగాలని సూచించారు.పైగా ఆయన గెలుపు బాధ్యత తానే చూసుకుంటానని చెప్పారు.అబ్బా ఈయనకి ఇంత సీన్ ఉందా అనుకునేలోపే ఇంకో బాంబు పేల్చాడు పాల్. ట్రంప్ ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిపించినవాడిని ….లోకేష్ ని గెలిపించడం తనకి ఓ లెక్కా అని పాల్ అనేశాడు.ఈ డైలాగు తో జనం చెవిలో పాల్ పెద్ద పుష్పమే పెట్టాడు.

అప్పుడెప్పుడో అజ్ఞాతం లోకి వెళ్లిన పాల్ ఇప్పుడు ఇలా లోకేష్ కి అభయ ప్రదాతగా ఎంట్రీ ఇవ్వడం వెనుక కథ అందరికీ తెలిసిందే..కాకుంటే లేటెస్ట్ గా కాస్త గుర్తు చేసుకుందాం..వై.ఎస్ హయాంలో క్రైస్తవ మెషినరీ నిధులు,ఆధిపత్యానికి సంబంధించి ఏర్పడ్డ విబేధాలు అనిల్ కుమార్,పాల్ మధ్య తీవ్ర అగాధం సృష్టించాయి.ఉన్నత స్థాయి వర్గాల జోక్యంతో సీన్ మారింది.లుకలుకలు అలానే వున్నా ఇరు వర్గాలు బయటపడకుండా ఉంటున్నాయి.ఎన్నికలు ఇంకా రెండేళ్లలోకి వస్తున్నందున వైసీపీ అధినేత జగన్ ని కౌంటర్ చేసేందుకు పాల్ తాజాగా లోకేష్ పాట పాడుతున్నాడు.జగన్ అధికారంలోకి వస్తే పాత రోజులు తప్పవని పాల్ భయపడుతున్నట్టున్నాడు. అయితే సందర్భ శుద్ధి లేకుండా ట్రంప్ మీద ఒక్క తెలుగు వాళ్ళే కాకుండా యావత్ ప్రపంచం ఆగ్రహిస్తున్న వేళ ఆయన్ని తానే గెలిపించానని ..ఇక లోకేష్ ని కూడా గెలిపిస్తానని చెప్పడం లోనే పాల్ సామర్ధ్యం,వ్యూహం ఎలా వుంటాయో అర్ధమవుతుంది…

Leave a Reply