వింత పేర్లతో ముగ్గురు తలుపు తట్టారు. ఆ తర్వాత ఏమైంది?

Love Money And Win Knock The Door What happened After That
Spread the love

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి, అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. రాత్రి 8 కావొస్తుంది. ఇంట్లో దీపం వెలుతురు తప్ప మరో కాంతి లేదు. ఆ చీకట్లో వారిని చూస్తే పెద్దవారిలా కనిపించారు.

దాంతో.‘లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు’ అంటూ ఆ ఇంటావిడ ఆహ్వానించింది.

‘మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయము. అతను తిరిగివచ్చిన తరువాతే లోపలికి వస్తాము’. అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటున్నారు.

భర్త పొలం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తుండటం గమనించి. బయట అరుగు మీద ఉన్న వారి వద్దకు వెళ్ళి. ‘నా భర్త వచ్చాడు లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా’. అని అడిగింది.

‘లేదు.. కాని మా ముగ్గురిలో ఒకడు మాత్రమే మీ ఇంట్లోకి వస్తాడు అది మా నియమం’. అన్నారు.

ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో చూస్తుండగా ఓ పెద్దాయన ఇలా అన్నాడు. ‘నా పేరు ప్రేమా, ఇతని పేరు గెలుపూ, ఈయన పేరు ఐశ్వర్యం. మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్వానించు’. అన్నాడు.

వచ్చిన వారు మాములు మనుషులు కాదని. ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న ఆశీర్వాదాలు అని తెలిసిపోయింది.

సంతోషంతో పొంగిపోతు ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. విన్న భర్త పరవశంతో. ‘బ్రతుకులో గెలుపే ముఖ్యము కాబట్టి ఆయన్నే పిలుద్దాం’. అని అన్నాడు.

దానికి ఆమె. ‘ఐశ్వర్యం లేకపోతే. గెలుపు ఒకటే ఉండి ఏమి లాభం? కాబట్టి ఐశ్వర్యంని ఆహ్వనిద్దాం’. అని అంది.

వీరి ఇద్దరి మాటలు వింటున్న వారి కోడలు. ‘గెలుపు, ఐశ్వర్యం కంటే ప్రేమ ఉంటె భార్యా భర్తలు, పిల్లలు, అత్తా కోడళ్ళు కలిసి మెలసి ఉండగలం కాబట్టి సుఖజీవనానికి ప్రేమే మూలాధారం’. అంటూ సలహ ఇచ్చింది.

వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి. ‘మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు’.

ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో బాటు ఇంట్లోకి వచ్చాయి. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఆ ముగ్గురూ ఇలా అన్నారు. ‘మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మిగతా ఇద్దరు ఉండిపోవాల్సి వచ్చేది. కాని ప్రేమను మీరు ఆహ్వానించడంతో.మేమూ పిలవకుండానే వచ్చాము. ప్రేమ వెన్నంటే గెలుపు, ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుని ఆజ్ఞ’. అని అన్నారు.

కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటె అక్కడ ఐశ్వర్యం, గెలుపు తప్పక ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here