లోమెమరీ అంటూ మీ ఫోన్‌ సతాయిస్తుందా..?

 Posted November 6, 2016
low memory on your mobile phone
అంతర్గత మెమరీ తక్కువుండటంతో ఇబ్బందిపడుతున్నారా..
ఈ చిట్కాలు పాటిచండి…
మంచి యాప్‌ బావుందని ఎవరైనా చెబితే దాన్ని వాడేందుకు మనం సుముఖత వ్యక్తం చేస్తుంటాం.. తీరా మొబైల్‌ ఓపెన్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేద్దామని ప్రయత్నిస్తే లోమెమరీ అంటూ అగిపోతూ ఉంటుంది.. అంతర్గత మెమరీ తక్కువగా ఉన్నవారు సహజంగా ఈ సమస్యను నిత్యం ఎద్కొంటూ ఉంటారు.. దాంతో చాలా ఇష్టమైన యాప్స్‌ కూడా అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తూ కొత్త ఫోన్‌ త్వరలో కొనుక్కోవాలని అంటూ ఎదురుచూపుల సంతృప్తి పడుతుంటారు.. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ మొబైల్‌ లోనే కావాల్సిన యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు… అవేలాగో చూద్దాం…
మన మెమరీ ఎంతో పరిశీలించాలి..
 సాధారణంగా ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో అంతర్గత మెమరీ (ఇంటర్నల్‌ స్టోరేజ్‌) 1 జీబీ నుంచి 8 జీబీ మధ్య ఉన్నవారికి ఇటువంటి సమస్య ఎక్కువగా వస్తుంటుంది. మొదట మీ అంతర్గత మెమరీ ఎంతుందో పరిశీలించుకోవాలి.. ముందుగా మెమరీ ఎంతో చూసుకుని ప్రస్తుతం ఇన్‌స్టాల్‌ అయిన యాప్స్‌ ఏవి ఎంత డాటా తీసుకుంటున్నాయొ చూడాలి.. దాని కోసం సెట్టింగ్స్‌ – యాప్స్‌ – ఆల్‌ యాప్స్‌ లోకి వెళ్లాఇ.. ఆ తరవాత పేరు ప్రకారం కాకుండా సైజ్‌ బట్టి వ్యూ ఎంచుకోవాలి.. దాంతో భారీ మెమరీ తీసుకునే యాప్స్‌ కనిపిస్తాయి.. వాటిలో మొదటి పది యాప్స్‌లో మనకు అవసరమైనవి ఏవనేది చూసుకోవాలి.. అవసరం లేనివి అనిస్టాల్‌ చేసుకోవాలి.. మెమరీ కార్డులోకి మూవ్‌ అయితే వాటిని అంతర్గత మెమరీ నుంచి ఎస్డీ కార్డులోకి పంపాలి.. అలా చే స్తే దాదాపు యాప్‌కు సంబంధించిన మెమరీ 60 శాతం పంపగలుగుతాం.. అలా అవకాశమున్నంత వరకు మెమరీని ఖాళీ చేయాలి.. అప్పుడు మరికొన్ని యాప్స్‌ వేసుకోవచ్చు..
ఫోన్‌తో వచ్చినవి తొలిగించండి
low memory on your mobile phoneమనం ఫోను కొన్నప్పుడు కొన్ని యాప్స్‌ మనకు అవసరం లేనివి కూడా దాంట్లో కలిపి వచ్చేస్తాయి. వాటిని గుర్తించి అనిన్‌స్టాల్‌  చేయాలి.. ఒక వేళ అది వీలు పడకపోతే వాటిని డిజేబుల్‌ అనే ఆప్షన్‌ని ఎంపిక  చేసుకోవాలి. దాని వల్ల అది అప్‌డేట్‌ తీసుకోకుండా చిన్న సైజ్‌లో ఆగిపోతాయి. సాధారణంగా గూగుల్‌ అందించే చాలా సర్వీసులు మనం వాడం.. అ కోవలోనే గూగుల్‌+ అనే యాప్‌ చాలా వరకు వాడరు.. అటువంటి యాప్‌లను డిసేబుల్‌ చేసుకోవచ్చు. దాంతో అంతర్గత మెమరీ చాలా వరకు వస్తుంది.
 
ప్రత్యామ్నాయాలు ప్రయత్నించాలి ప్రస్తుతం ఉన్న యాప్‌లలో ఫేస్‌బుక్‌ వంటివి భారీగా అంతర్గత మెమరీని తియనేయడంతోపాటు ఎస్‌డీ కార్డులోకి కూడా మూవ్‌ కావు.. అలగని వాటిని వదులుకోలేము.. అలాటప్పుడు వాటికి ప్రత్యామ్నాయం ఎమన్నా ఉందో లేదో పరిశీలించాలి.. చాలా పెద్ద సంస్థ మెమరీ సమస్యను గుర్తించి ‘లైట్‌’ వర్షన్లను అందిస్తుంది. అదే కోవలో ఫేస్‌బుక్‌ రెగ్యులర్‌ యాప్‌ అన్‌ఇన్‌స్టాల్‌ చేసుకుని లేదా డిసేబుల్‌ చేసుకుని లైట్‌ వర్షన్‌ వేసుకోవాలి. రెగ్యులర్‌ యాప్‌ 100 ఎంబీ నుంచి 500ఎంబీ వరకు డాటా తీసుకుంటే ఈ లైట్‌ వర్షన్‌ కేవలం 5 ఎంబీ లోపులోనే డాటా తీసుకుంటుంది. దాంతో 90 శాతం స్థల ఆక్రమణ తక్కుతుంది. అదే తరహాలో దానితోపాటు ట్విట్టర్‌ యాప్‌కి బదులుగాTweedle యాప్‌, యూట్యూబ్‌కి బదులుగా YTMovies (Lite)) యాప్‌, రెగ్యులర్‌ ఈ మెయిల్‌ యాప్‌కి బదులుగా   CloudMagic  వంటి యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే వాటికి సంబంధించిన డాటాని మొబైల్‌లో అంతర్గతంగా పేరుకుపోకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. మరిన్ని ఇవన్నీ పాటించి తక్కువ మెమరీ ఉన్నా కావాల్సిన యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని ఎంజాయ్‌ చేయండి మరి…
SHARE