మీ జీతం మొత్తం ఖర్చుయ్యిందా.. అయితే మీకు డబ్బేడబ్బు…

Posted November 9, 2016
low salary people are required for bigshots
ఇప్పటి వరకు చెలామణిలోఉన్న రూ.500, రూ.1000 నోట్లు రద్దు అన్న వెంటనే.. మేధావులు అద్భుత నిర్ణయమని ఆనందపడ్డారు.. డబ్బులతో చిన్న అవసరాలు తీర్చుకునేవారు మన నోట్లు చెల్లుతాయాన అని కంగారుపడ్డారు.. అదే ఇంట్లో క ట్టలు కట్టలుగా దాచుకునేవారు మాత్రం కంటి నిద్ర కూడా పోలేదంటే నమ్ముతారు.. అదేంటి.. మీకు డబ్బే డబ్బు అన్నారు.. మళ్లీ ఈ వివరాలేంటనుకుంటున్నారా.. అక్కడకి వస్తున్నా…చిన్న జీతం ఉన్నవాళ్లు సాధారణంగా బ్యాంకు ఖాతాల్లో పెద్దగా డబ్బులుండవు.. ఏ నెలకానెల వచ్చే మొత్తాన్ని పూర్తిగా ఖర్చు చేస్తారు.. ఇప్పుడు అలాంటి వారికి కనక వర్షం కురవ నుంది… నల్ల డబ్బు దాచుకునేవాళ్లు ఇప్పుడు నేరుగా బ్యాంకులకెళ్లి మార్చుకునే సాహసం చేయరు.. అలాగని అంత డబ్బు వదులుకోలే రు.. ఇప్పుడు వారికి సొమ్ములు తక్కువగా ఉన్న వ్యక్తులు కావాలి.. వారిపేరు మీద డబ్బులు మార్చాలి.. అందుకే ఇలా అత్తెసర జీతాలపై ఆధారపడేవాళ్లను వెతికే పనిలో ఉన్నారు. మీకు డబ్బులిస్తాం మార్చిస్తారా కమిషన్‌ ఇస్తామంటూ మంగళవారం రాత్రి నుంచి మొబైల్‌ ఫోన్లు మొగడం మొదలెట్టాయి.. మీరు కట్టే ట్యాక్స్‌తో సహా ఇస్తాం.. మావి మార్చడంటే మావి మార్చాలంటూ బతిమలాడుతునానరు.. 
low salary people are required for bigshots
ప్రతి వ్యక్తి  ఏటా కొద్ది మొత్తంలో లావాదేవీలు చేసినా.. ఆదాయపన్ను చెల్లించాల్సిన పనిలేదు.. ఎందుకంటే ఆదాయం రూ.2లక్షల లోపైతే అసలుపన్నే ఉండదు.. అదే రూ.5 లక్షల వరకు అయితే పది శాతం అంటే రూ.50వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలా శ్లాబులుపెరిగేకొద్ది 30 శాతం వరకు ఇవ్వాల్సి ఉంటుంది.. అది కూడా అంత సొమ్ము ఎలా వచ్చింది చూపించాలి.. ఒక్కరే అంత భారీగా చూపిస్తే నల్ల ధనమని తెలిసిపోతుంది. అలా మొత్తం సొమ్ములను ఆదాయం వచ్చినట్లు చూపించడం కష్టం.. ఒక వేళ చూయించిన 30 శాతం చెల్లించాలంటే అంతా ప్రభుత్వానికే పోతుంది. ఈ క్రమంలో ఒక్కో మనిషికి రూ.5లక్షల లక్ష్యం పెట్టుకుని వారికి ఆదాయపన్ను చెల్లించి రూ.50వేల వరకు కమిషన్‌ ఇస్తామని ఆఫర్‌ కూడా ఇస్తున్నారు.. దీంతో ఎలాంటి వారైన సులభంగా రూ.50వేల పైనే సంపాదించుకునే అవకాశం దక్కినట్లైయ్యింది.. మోదీ నిర్ణయంతో పెద్దోళ్ల డబ్బు పేదొళ్లకు బదిలీ అవుతుంది.. దీని గురించే మధ్యతరగతి వర్గం ప్రధానికి థాక్స్‌ చెబుతూ.. నగదు బదిలీకి సై అంటున్నారు…
                                                                                                                                                       -శ్రీ
SHARE