Friday, October 22, 2021
Homelatestపాపులర్ సీఎంకు పీపుల్స్ షాక్

పాపులర్ సీఎంకు పీపుల్స్ షాక్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విద్యార్థుల శక్తికి ఎవరైనా తల వంచాల్సిందే. ఉద్యమాలు నడపడం, అనుకున్నది సాధించడంలో విద్యార్థులది అందె వేసిన చేయి. ఇప్పుడు విద్యార్థుల సత్తా ఏంటో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కూడా తెలిసొచ్చింది. స్టూడెంట్స్ దెబ్బకు లక్నో నడివీధిలో సీఎం కాన్వాయ్ ఆగిపోయింది. దీంతో అధికారులు ఆపసోపాలు పడి కాన్వాయ్ కదిలించారు.

దేశంలో ప్రస్తుతం జనాదరణ ఉన్న సీఎం అంటే ముందుగా గుర్తొచ్చే పేరు యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ లాంటి దేశంలోనే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నారాయన. యాంటీ రోమియో స్క్వాడ్లు, క్లీన్ సెక్రటేరియట్, రైతులకు రుణమాఫీ ఇలా అన్నీ మంచి పనులే చేస్తున్నారు. యోగి వచ్చాక లక్నో సెక్రటేరియట్ వాతావరణమే మారిపోయిందని పలువరు కితాబు కూడా ఇస్తున్నారు.

అప్రతిహతంగా దూసుకుపోతున్న యోగికి విద్యార్థులు షాకిచ్చారు. లక్నో వర్సిటీకి వెళ్లిన యోగికి. ఊహించని చేదు అనుభవం ఎదురైంది. సీఎం కాన్వాయ్ ను అడ్డుకున్న దళితులు, ముస్లింలపై దాడులు పెరిగాయని నిలదీశారు. ఓ దశలో ఏం జరుగుతుందో అర్థంకాక కాన్వాయ్ నిలిపేశారు అధికారులు. దీంతో కాన్వాయ్ అధికారుల తీరుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి భద్రత విషయంలో ఇంత నిర్లక్ష్యమేంటని పలువుర్ని సస్పెండ్ చేశారు. మొత్తం మీద విద్యార్థుల దెబ్బ ఎలా ఉంటుందో యోగికి బాగా తెలిసొచ్చింది.

- Advertisment -
spot_img

Most Popular