లక్కున్నోడు రివ్యూ

0
275
luckunnodu review

Posted [relativedate]

luckunnodu review
చిత్రం పేరు : లక్కున్నోడు
నటీనటులు: మంచు విష్ణు, హన్సిక, రాజేంద్రప్రసాద్‌, జయప్రకాష్‌, పోసాని, తనికెళ్లభరణి, రఘుబాబు, ప్రభాస్‌ శీను తదితరులు.
సంగీతం: అచ్చు, ప్రవీణ్‌ లక్కరాజు
ఛాయాగ్రహణం: పిజి విందా
మాటలు: డైమండ్‌ రత్నబాబు
నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ
సమర్పణ: ఎంవివి సినిమా
రచన – దర్శకత్వం : రాజ్‌ కిరణ్‌
విడుదల తేదీ: 26-01-2017

మంచు వారసుడు విష్ణు, హన్సిక జంటగా నటించిన తాజా చిత్రం లక్కున్నోడు. కామెడీ ఎంటర్ టైనర్ ఈడోరకం ఆడోరకం సినిమాతో హిట్ ను అందుకున్న విష్ణు అదే రేంజ్ హిట్ కొట్టాలని తనకు బాగా అచ్చొచ్చిన హీరోయిన్ హన్సికనే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. వీళ్లద్దరి కాంబినేషన్ లో వచ్చిన వినోదాత్మక సినిమాలు ‘దేనికైనా రెడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ మంచి విజయాలు అందుకున్నాయి. మరి విష్ణు వేసిన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా… గీతాంజలితో హారర్‌ కామెడీ హిట్ కొట్టిన రాజ్‌ కిరణ్‌ కి, విష్ణుకి లక్కున్నోడు… లక్ ను అందించాడో లేదో చూద్దాం.

కధ ఏంటంటే..?

సినిమా కధ ఓ రాబరీతో స్టార్ట్ అవుతుంది. జె.కె.(ఎం.వి.వి.సత్యనారాయణ) అనే రౌడీ పాతిక కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు. కానీ జె.కె. దగ్గర పని చేసే ఒకడు ఆ డబ్బు మొత్తం కొట్టేసి జె.కె.ని మోసం చేస్తాడు. లక్కీ(మంచు విష్ణు) పేరులో ఉన్న అదృష్టం అతని జీవితంలో ఉండదు. లక్కీ పుట్టగానే వచ్చిందనుకున్న ఆస్తి మొత్తం పోతుంది. కొడుకు దురదృష్టవంతుడని నమ్మిన తండ్రి, కొడుకిని లక్కీ అని పిలవడం కూడా మానేస్తాడు. హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేయాలనుకున్న లక్కీ ఓ ఆఫీస్‌ కి ఇంటర్వ్యూకి వెళ్తాడు. అక్కడ పద్మావతి(హన్సిక)ని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు పద్మావతి కూడా లక్కీని ప్రేమిస్తుంది. మరోపక్క లక్కీ చెల్లెలికి పెళ్లి కుదురుతుంది. పెళ్లికి ఇవ్వాల్సిన పాతిక లక్షల కట్నం డబ్బు ఉన్న బ్యాగ్ ను లక్కీ పెళ్లి కొడుకు తండ్రికి ఇస్తాడు. అయితే పెళ్లి కొడుకు తండ్రికి మతిమరుపు ఉండడంతో డబ్బు ఇవ్వలేదని చెబుతాడు. దీంతో తండ్రి కోప్పడడం, పద్మావతి వదిలివెళ్లిపోడంతో లక్కీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో లక్కీ దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి ఒక బ్యాగ్ ఇస్తాడు. ఆ బ్యాగ్ ఒకరోజు తన దగ్గర పెట్టుకుంటే కోటి రూపాయలు ఇస్తానని చెబుతాడు. దానికి లక్కీ సరే అంటాడు. ఇంతకీ ఆ బ్యాగులో ఏముంది? దురదృష్టవంతుడు లక్కున్నోడుగా ఎలా మారాడు..? చివరకు ఆ డబ్బు ఎవరి చేతికి వెళ్లింది..? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే:
సినిమా ఫస్టాఫ్ అంతా క్యారక్టర్స్ ను పరిచయం చేయడం, ఓ లవ్ ట్రాక్ రెండు పాటలు, మూడు కామెడీ సీన్లు, ఫ్యామిలీ సెంటిమెంట్‌ తో నడుస్తుంది. అప్పటివరకు లక్ లేదని బాధ పడే వ్యక్తికి సడెన్‌ గా సెకెండాఫ్ లో అదృష్టం కలిసొస్తుంది. పరాయి సొమ్ముకి ఆశ పడని హీరో దగ్గరకు అనుకోకుండా పాతిక కోట్లు వస్తే ఏం చేశాడనేది సినిమా.

ఎవరెలా చేశారంటే: విష్ణు కామెడీ టైమింగ్‌ బాగుంది. బాడీ లాంగ్వేజ్‌ లోనూ మార్పు స్పష్టంగా తెలుస్తోంది. కొన్ని కొన్ని సన్నివేశాల్లో మోహన్‌ బాబును ఇమిటేట్‌ చేశాడని భావించక తప్పదు. ఇక హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితమయ్యింది. వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్‌ల కామెడీ పండింది. విలన్ పాత్రలో ఎం.వి.వి.సత్యనారాయణ ఫర్వాలేదనిపించారు. అలానే సెకండ్ హాఫ్‌లో పోసాని కృష్ణ మురలి తనదైన శైలిలో ప్రేక్షుకుల్ని ఆకట్టుకున్నారు. టెక్నికల్ వ్యాల్యూస్ మాత్రం యావరేజ్ అనే చెప్పాలి.

బలాలు

+కామెడీ
+ ఇంటర్వెల్ బ్యాంగ్
+ ఫ్యామిలీ సెంటిమెంట్
బలహీనతలు
– కధ, కధనం
-పాటలు

చివరగా.. లక్కున్నోడికి లక్ అందలేదు

రేటింగ్ : 2.5 

Leave a Reply