మా అబ్బాయి రివ్యూ..!!

145

Posted March 17, 2017, 4:32 pm

maa abbai movie reviewచిత్రం:  మా అబ్బాయి 
తారాగణం: శ్రీవిష్ణు, చిత్ర శుక్ల, కాశీ విశ్వ‌నాథ్‌, స‌న

సంగీతం: సురేష్ బొబ్బిలి  
ఛాయాగ్ర‌హ‌ణం: థ‌మ‌శ్యామ్ 
నిర్మాత:  బ‌ల‌గ ప్ర‌కాష్ రావు 

సంస్థ: వెన్నెల క్రియేష‌న్స్‌
క‌థ‌, స్క్రీన్ ప్లే,మాట‌లు,ద‌ర్శ‌క‌త్వం: కుమార్ వ‌ట్టి

విడుదల తేదీ: 17-3-2017

ప్రేమ ఇష్క్ కాద‌ల్‌, జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా, అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు వంటి డిఫరెంట్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ఇప్పటివరకు మల్టీస్టారర్స్ లో నటించిన శ్రీ విష్ణు  తొలిసారి సోలోగా చేసిన ప్రయత్నమే మా అబ్బాయి. టీజర్ తో ఈ సినిమా బాగానే హైప్ క్రియేట్ చేసింది. మరి ఈ రోజు  ప్రేక్షకుల ముందుకొచ్చిన “మా అబ్బాయి”  ప్రతిభ ఎలా ఉందో  తెలుగు బుల్లెట్ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కధ ఏంటంటే:

ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్‌.. ఆనంద‌రావుగా, ఆనందరావు కొడుకుగా.. శ్రీవిష్ణు, ఎదురింట్లో ఉంటే అమ్మాయిగా… చిత్ర శుక్ల నటించారు.

మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబీకుడైన ఆనంద‌రావు తన భార్య, పిల్లలతో  హైద‌రాబాద్‌లోని ద్వారక నగర్ లో  నివ‌సిస్తుంటాడు. కొడుకు శ్రీవిష్ణు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తుంటాడు. వీరి లైఫ్ ఆనందంగా సాగిపోతున్న స‌మ‌యంలో ఆనంద‌రావు కూతురుకి పెళ్ళి నిశ్చ‌య‌మ‌వుతుంది. కూతురు పెళ్ళి కోస‌మ‌ని కుటుంబ‌మంతా క‌లిసి షాపింగ్‌ కి  వెళ‌తారు. ఇంటికి తిరిగొస్తూ వ‌స్తూ సాయిబాబా గుడికి వెళ‌తారు. అక్క‌డ ఉగ్ర‌వాదులు పేల్చిన బాంబులతో అబ్బాయి మిన‌హా కుటుంబ స‌భ్యులంతా చనిపోతారు. ఈ బాంబు దాడి  వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ కుట్ర ఉందని తెలుసుకుని వారిని అంతమొందించాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో చిత్ర శుక్లతో ప్రేమలో పడతాడు. హీరోయిన్‌ తో ప్రేమ సాగిస్తూనే  హంతకుల వేట కొనసాగిస్తుంటాడు. తన కుటుంబీకుల మరణానికి కారణమైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు.. ప్ర‌తీకారం వ‌ల్ల  ప్రేమించిన  అమ్మాయికి ఎదురైన పరిస్థితులు ఏంటి.. వంటి ఆసక్తిర విషయాలు తెలుసుకోవాలనుకుంటే సినిమాను వెండితెరపై  చూడాల్సిందే.

కధనం ఏంటంటే:

ఉగ్రవాదుల బాంబు పేలుడులో  కుటుంబాన్ని కోల్పోయి అనాధగా మారిన హీరో చివరికి ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు అనేదే మా అబ్బాయి కధ.  ఇటువంటి కధలు మన వెండితెర మీద చాలా సార్లే దర్శనమిచ్చాయి. అయితే వాటిల్లో హీరోలు హీరోయిజం చూపించగలిగే పవర్ ఫుల్ అధికారుల పాత్రల్లో నటిస్తే ఈ అబ్బాయి మాత్రం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటించాడు. ఫస్టాఫ్, సెకండాఫ్ మొత్తం అబ్బాయి చుట్టూనే తిరుగుతుంది.

ఎవరు ఎలా చేశారంటే:

ఇప్పటివరకూ డిఫ‌రెంట్ మల్టీస్టారర్ సినిమాల‌ను చేస్తూ వ‌చ్చిన శ్రీ విష్ణు ఈసారి క‌మ‌ర్షియ‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌ టైన‌ర్‌లో మాస్‌ కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేశాడు. డాన్స్ లు, ఫైట్స్ బాగానే చేసినా మాస్ హీరోకి ఉండాల్సిన బాడీ లాంగ్వేజ్ ని మాత్రం చూపించలేకపోయాడు. చిత్ర శుక్ల గ్లామర్ షోకి పరిమితమయ్యింది. ఉగ్రవాద నేపథ్యం సాగే  కథలో విలన్ రోలే చాలా ముఖ్యం. అలాంటిది ఈ సినిమాలో విలనే పేలవంగా ఉంటాడు. కధను తెరమీద చూపించడంలో దర్శకుడు తడబడ్డాడని చెప్పవచ్చు. థ‌మ శ్యామ్ కెమెరా ప‌నిత‌నం, సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది.

ప్లస్ పాయింట్స్:
 హీరో డాన్సులు, ఫైట్స్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

కధ, స్క్రీన్ ప్లే

విలన్

కామెడీ లేకపోవడం

ఆఖరి పంచ్:

మా అబ్బాయి.. బిలో యావరేజ్ అబ్బాయి

Telugu Bullet Rating: 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here