ఆ దేవత కన్నా మంచు లక్ష్మి గొప్పా ?

Posted February 1, 2017

machu lakshmi is great than goddess

machu lakshmi is great than goddessమోకాలికి ,బోడిగుండుకు ముడి పెట్టాలంటే మనకు సాధ్యం కాకపోవచ్చేమో గానీ వర్మకి అది వెన్నతో పెట్టిన విద్య.ఏపీ ని గన్ తో పోల్చిన కాసేపటికే ఇంకో ట్విట్టర్ అస్త్రం ప్రయోగించారు రామ్ గోపాల్ వర్మ.ఆయనకు ఆ ఆలోచన ఎందుకు ..ఎలా వచ్చిందో ? ఆంధ్ర ప్రదేశ్ గన్ తన చేతిలో వున్నందుకు లక్ష్మీదేవి సంతోషపడుతుందని ట్వీట్ పెట్టాడు.ఆ కాసేపటికి ఏమైందో కానీ …విష్ణుమూర్తి సతీమణి లక్ష్మీదేవితో పోలిస్తే మోహన్ బాబు గారి కుమార్తె మంచు లక్ష్మిని ముప్పై రెండున్నర రెట్లు ఎక్కువగా ఆరాధిస్తానని పోస్ట్ చేశాడు.ఈ పోలిక ఏంటో …ఆయన గారు ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చాడో అర్ధం కాక జనం జుట్టు పీక్కుంటున్నారు.మరికొందరు మాత్రం మోహన్ బాబు కుటుంబం గురించి మాట్లాడి వర్మ తప్పు చేస్తున్నాడని హెచ్చరిస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం నిజం. వర్మ ట్వీట్ లలో పొగుడుతున్నాడో ..తిడుతున్నాడో ఎవరికైనా అర్ధం అయినప్పుడు సంగతి కదా !

SHARE