దీపా జ‌య‌కుమార్ కు ఇంటిపోరు!!

0
283
madhavan became anti to deepa

Posted [relativedate]

madhavan became anti to deepa
జ‌య‌లలిత అస‌లైన వారసురాలు తానేనంటూ కొత్త పార్టీని ప్రారంభించిన దీపా జ‌య‌కుమార్ కు ఇంటిపోరు మొద‌లైంది. ఎంజీఆర్ అమ్మ దీప పెర‌వై పార్టీని ప్ర‌క‌టించి… ఇప్పుడు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న ఆమెకు అప్పుడే ఇబ్బందులు ప్రారంభ‌మ‌య్యాయి. ఆమె భ‌ర్త మాధ‌వ‌న్ తిరుగుబాటు చేశారు. పార్టీ విష‌యంలో దీప‌ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆయ‌న మండిప‌డుతున్నారు.

అస‌లే కొత్త పార్టీ. ఈ త‌రుణంలో పార్టీని చాలా ప‌క్కాగా ముందుకు తీసుకెళ్లాలి. అన్ని వ‌ర్గాల‌కు స‌ముచిత ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ నేప‌థ్యంలో కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు త‌ప్ప‌వు. అయిన‌వారిని కూడా ప‌క్క‌న‌బెట్టే అవ‌కాశ‌ముంది. ఇదే ఇప్పుడు ర‌చ్చ‌కు తెర తీసింది. త‌న భ‌ర్త మాధ‌వ‌న్ ను ఆమె పార్టీకి దూరంగా ఉంచుతున్నారు. అయితే ఆది ఆయ‌న స‌హించ‌లేక‌పోతున్నారు. అందుకే ఆయ‌న దీప‌పై తిరుగుబాటు చేశారు.

ఒక‌వైపు శ‌శిక‌ళ‌… మ‌రోవైపు ప‌న్నీర్ సెల్వం.. అటు చూస్తే డీఎంకే… ఈ ఉద్దండుల మ‌ధ్య దీప రాణించాలంటే జ‌య‌ల‌లిత లాంటి తెగువ‌ను చూపాలి. కానీ దీప‌కు అలాంటి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నాయా అన్న‌ది అనుమాన‌మే. అయితే ఇటీవ‌ల ఆమె పార్టీ నాయ‌కుల పేర్ల‌ను ప్ర‌క‌టించారు. కానీ అందులోనూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక దీప కూడా కొంత ఇప్పుడు వ‌ర్క‌వుట్ చేస్తున్నార‌ట‌. అయితే ఈలోపే ప‌న్నీర్ సెల్వం నుంచి మ‌రోసారి ఆమెకు పిలుపు వ‌చ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

రోజురోజుకు త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే అమ్మ అభిమానుల సంఖ్య త‌గ్గిపోవ‌డం.. ఇటు ప‌న్నీర్ సెల్వం నుంచి పిలుపు… ఈ నేప‌థ్యంలో దీప పార్టీ ఉనికి క‌ష్ట‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆమె సెల్వంతో క‌లిసి రాజ‌కీయ అడుగులు వేస్తే బావుంటుంద‌ని అమ్మ అభిమానులు కోరుకుంటున్నార‌ట‌. మ‌రి ఆమె ఇంటిపోరును త‌ట్టుకొని నిల‌బ‌డుతారా? లేక సెల్వం సారు పిలుపును అందుకొని ఆయ‌న వెంట న‌డుస్తారా ? అన్న‌ది చూడాలి.

Leave a Reply