అతనొక్కడే మలుపు తిప్పాడు!!

0
442
madhusudhan made a turn in apneer life

Posted [relativedate]


పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసే వరకు ఆయన దగ్గర ఒక్కరంటే ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేరు. సింగిల్ ఎమ్మెల్యే సపోర్ట్ లేకుండా.. కేవలం కేంద్రంపైనే భరోసాతో తిరుగుబాటు చేశారు సెల్వం. కానీ బయటకు వచ్చాక కానీ పరిస్థితి అర్థం కాలేదు. ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటే తప్ప కేంద్రమైనా.. మరొకరైనా అండగా ఉంటారని అర్థమైంది. దీంతో ఏం చేయాలో తెలియక కొంత డైలమాలో పడ్డారు. తిరుగుబాటు .. తొందరపాటా అన్నంతగా చర్చ జరిగింది. కథ ముగిసింది అనుకుంటున్న తరుణంలో పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదన్ రాకతో .. పరిస్థితులన్నీ తారుమారైపోయాయి.

మధుసూధన్ రాకతో సెల్వం కథ మారిపోయింది. జీరో అనుకున్న పన్నీర్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. మధుసూధన్ రూపంలో సెల్వంకు పెద్ద అండ దొరికింది. పార్టీలో ముఖ్యులు ఎవరిని ఎలా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే విషయాలు బాగా తెలిసిన మధుసూదనన్ పార్టీ కేడర్ను పన్నీర్ శిబిరంలోకి తేవడంలో నిమగ్నమయ్యారు. విస్తృతమైన సంబంధాలు, అవగాహనతో పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి సి.పొన్నయ్యన్తోపాటు ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా శాఖల ముఖ్యులు పన్నీర్ శిబిరంలో చేరిపోయారు. ఎమ్మెల్యేల రాక అంతకంతకూ పెరుగుతోంది. ఎంపీలు కూడా వచ్చేస్తున్నారు. మంత్రి పాండియరాజన్, ఎంపీలు టీఆర్ సుందరం, అశోక్కుమార్, సత్యభామ, వనరోజాలతోపాటు పలువురు పార్టీ ముఖ్యులు కూడా పన్నీర్ కు జై కొట్టారు. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న సెల్వం ఒక్కసారిగా దూకుడు పెంచడానికి మధుసూదనే కారణమని టాక్. ఆయన వ్యూహరచన వల్లే ఇదంతా సాధ్యమైందట. ఒకవేళ పన్నీర్ సెల్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ క్రెడిట్ కూడా మధుసూదన్ కే ఇవ్వాలి. ఎందుకంటే సెల్వంను ఇప్పుడు బలీయమైన రాజకీయ శక్తిగా తయారు చేసిన ఘనత ఆయనకే చెందుతుంది. అందుకే సెల్వం వర్గీయులంతా ఇప్పుడు మధుసూదన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. !!!

Leave a Reply