మరో వివాదంలో ధనుష్‌.. సూపర్‌ స్టార్‌ పరువు తీస్తున్నాడు

Posted April 14, 2017

madona sebastian insulting dhanush to control his words
సూపర్‌ స్టార్ట్‌ రజినీకాంత్‌ అల్లుడు ధనుష్‌పై ఇటీవ వరుసగా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఆమద్య సింగర్‌ సుచిత్ర చేసిన ఆరోపణలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింగర్‌ సుచిత్ర తనను ధనుష్‌ శారీరకంగా మరియు మానసికంగా హింసించాడని, తనను రేప్‌ చేసేందుకు కూడా ప్రయత్నించాడు అంటూ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ధనుష్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇక కదిరేశన్‌ దంపతులు ధనుష్‌ తమ కొడుకంటూ కొంత కాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. వారిపై ఇప్పటి వరకు స్పందించని ధనుష్‌పై విమర్శలు వ్యక్తం అవుతున్న ఈ సమయంలో మరో హీరోయిన్‌ సంచలన ఆరోపణలు చేసింది.

తెలుగులో ‘ప్రేమమ్‌’ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా నటించిన మడోనా సెబాస్టియన్‌ ఈ వ్యాఖ్యలను చేసింది. ధనుష్‌ తాజా చిత్రం ‘పవర్‌ పాండి’ చిత్రంలో మడోనా సెబాస్టియన్‌ గెస్ట్‌ రోల్‌ను చేసింది. ఆ సినిమా విడుదలకు సిద్దం అయిన నేపథ్యంలో ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సిందిగా మడోనా సెబాస్టియన్‌ ధనుష్‌ అండ్‌ టీం కోరడం జరిగింది. అయితే ఇతర సినిమాలతో బిజీగా ఉన్న మడోనా ప్రమోషన్స్‌లో పాల్గొనలేను అంటూ చెప్పడంతో ఆమెపై ధనుష్‌ కాస్త ఘాటు వ్యాఖ్యలను చేశాడట. దాంతో మడోనా సోషల్‌ మీడియాలో స్పందిస్తూ ఎవరైనా సరే మాట అదుపులో పెట్టుకోవాలి అంటూ ధనుష్‌ను ఉద్దేశించి పోస్ట్‌ చేసింది. మరో వైపు ధనుష్‌ నిర్మాతల మండలిలో మడోనాపై ఫిర్యాదుకు సిద్దం అవుతున్నాడు. మొత్తానికి ధనుష్‌ మరో వివాదం మొదలైంది.

SHARE