వెయ్యి కోట్ల మహాభారత్‌కు రంగం సిద్దం

0
442
mahabharatham with 1000 crores

Posted [relativedate]

mahabharatham with 1000 crores
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి కన్న కల సాకారం కాబోతుంది. అయితే ఆయన వల్ల కాకుండా వేరే వారి వల్ల అది సాకారం కాబోతున్నందుకు తెలుగు ప్రేక్షకులకు కాస్త నిరాశ మరి కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ‘మహాభారతం’ను తెరకెక్కించాలని కోరుకున్నాడు. అయితే అందుకు సమయం కావాలని, రానున్న రోజుల్లో తీస్తానని చెప్పుకొచ్చాడు. ఈలోపు ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థతో కలిసి దర్శకుడు వి. ఎ. శ్రీకుమార్‌ మేనన్‌ మహాభారతంను తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.

ఎంటీ వాసుదేవ్‌ నాయర్‌ రాసిన రాందముళం అనే నవల ఆధారంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించి 2020 వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. వెయ్యి కోట్లకు మించిన బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దేశంలోని అన్ని భాషల నటీనటులను ఈ చిత్రం కోసం ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హాలీవుడ్‌ నటీనటులు కూడా ఇందులో కనిపించే అవకాశాలున్నాయట. దేశంలోని అన్ని భాషతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వంద విదేశీ భాషల్లో డబ్బింగ్‌ చేసి విడుదల చేయాలనేది ప్లాన్‌గా తెలుస్తోంది. ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై గతంలో ఎప్పుడు సాధ్యం కాని విధంగా ఈ సినిమాను రూపొందించేందుకు ప్లాన్స్‌ జరుగుతున్నాయి.

Leave a Reply