ఫోన్ కాల్ అస్త్రం..రోజుకి కోటి ఆదాయం

0
546

Posted [relativedate]

 maharashtra thane it park call center corruption
చదువుకున్నోడు..తెలివైనోడు దిగజారితే ఆ పరిణామాలు ఎలా వుంటాయో తెలియజెప్పే ఘటన ఇది.అనగనగా అమెరికాలో ఓ కాల్ సెంటర్.ఆ కాల్ సెంటర్ నుంచి ఐటీ చెల్లింపుల గురించి  వినియోగదారులకి సమాచారం అందిస్తారు.అమెరికన్ల ఫోన్ నంబర్లు పట్టుకున్న ఆ కాల్ సెంటర్ యజమాని ఇక్కడ మహారాష్ట్రలోని థానే లోని ఐటీ పార్క్ లో మూడు కంపెనీలు ఓపెన్ చేసాడు.700 మంది ఉద్యోగుల్ని అపాయింట్ చేశాడు.అక్కడ వాళ్ళు చేసే పనేంటో తెలుసా?
యజమాని ఇచ్చిన ఫోన్ నంబర్లకు రింగ్ చేయడం..పక్కా అమెరికన్ యాక్సెంట్ లో మేము ఇంటర్నల్ రెవిన్యూ సర్వీసెస్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి..మీరు ఐటీ ఎగ్గొట్టారు కాబట్టి ఫైన్ అయినా కట్టండి లేదా కేసులు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరించడం.

వాళ్ళు కాళ్ళ బేరానికి రాగానే ఎంతోకొంత అకౌంట్ లోజమ చేయించడం.ఇలా వసూలయ్యే డబ్బు ఎంతో తెలుసా? రోజుకి కోటి నుంచి కోటిన్నర పైమాటే.10 నుంచి 30 వేల రూపాయల శాలరీకి అక్కడ పని చేస్తున్న వారిలో కొందరికి తాము నేరం చేస్తున్నామని కూడా తెలీదు.అమెరికన్ ఐటీ విభాగం అవుట్ సోర్సింగ్ పని చేస్తున్నామనుకుంటారు.కానీ మోసపోయిన అమెరికన్స్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 70 మందిని అరెస్ట్ చేశారు.ఈ ప్లాన్ అమలు చేస్తున్న సూత్రధారికోసం అటు అమెరికన్ పోలీసులు,ఇటు ఇండియన్ పోలీసులు గాలిస్తున్నారు.అన్నట్టు చెప్పడం మరిచాం ఈ దొంగ కంపెనీ వార్షిక ఆదాయం 300 కోట్లు పైమాటే.

Leave a Reply