మహేష్.. ఏజెంట్ శివ ?

 Posted October 17, 2016

mahesh AR murugadoss new movie title agent siva

ఇప్పటి వరకు ఎనిమీ, శత్రువు, అభిమన్యుడు.. ఇప్పుడు ఏజెంట్ శివ. ఇవన్నీ మహేష్ బాబు-మురగదాస్ సినిమా కోసం ప్రచారంలో ఉన్న టైటిల్స్ పేర్లు.
‘ఏజెంట్ శివ’ కొత్తగా ప్రచారంలోకి వచ్చిన టైటిల్. మురగదాస్ చిత్రంలో మహేష్ సీఐడీ ఏజెంట్ గా కనిపించబోతున్నారంటూ ప్రచారం జరిగింది. దీనికి
ప్రతిబింబిస్తూ.. ‘ఏజెంట్ శివ’ టైటిల్ ఉండటంతో ప్రిన్స్ ఫ్యాన్ కూడా ఈ టైటిల్ పై ఆసక్తిని కనబరుస్తున్నారు. మరి.. ఇందులో ఏ టైటిల్ మహేష్-మురగదాస్ టైటిల్ ఫిక్స్ కానుందనేది ఈ దీపాఌకి తేలనుంది. ఎందుకంటే.. దీవాఌ కానుకగా మహేష్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.

ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. విలన్ గా దర్శకుడు ఎస్.జె సూర్య నటించనున్నాడు. దాదాపు రూ. 70కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెలుగు, తమిళ్ లో తెరకెక్కనుంది. ఈ చిత్రం వచ్చే యేడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

SHARE