టాలీవుడ్ లో రూమర్లకు కొదవ ఉండదు అన్న సంగతి తెలిసిందే. ఎక్కడి నుండి పుట్టుకొస్తాయో తెలియదు కానీ ఈ రూమర్లు మాత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంటాయి. అలా తాజాగా చక్కర్లు కొడుతోంది ఓ వార్త. ఇండియన్ స్పైడర్ మ్యాన్ గా మహేష్ బాబు నటిస్తున్నాడన్నది ఆ వార్త సారాంశం.
మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబందించి టైటిల్ విషయంలో ఇంకా కన్ ఫ్యూజన్ వీడలేదు. ఈ లోపే ఈ సినిమాలో మహేష్… స్పైడర్ మ్యాన్ గా నటిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్న మహేష్.. కొన్ని కీలక సన్నివేశాల్లో స్పైడర్ మ్యాన్ లా కూడా మారతాడట. ఎన్నో అద్భుతాలు కూడా ప్రదర్శించనున్నాడట. దీంతో ఈ సినిమాకు ‘స్పైడర్ మ్యాన్’ అని టైటిల్ పెడితే బాగుంటుందని చర్చించుకుంటున్నారట దర్శకనిర్మాతలు. ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ మహేష్ స్పైడర్ మ్యాన్ గా నటిస్తున్నాడని వినిగానే మహేష్ అభిమానులు మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. సినిమా రిలీజ్ అయ్యే లోపు ఇంకెన్ని రూమర్లు వస్తాయో. మరి ఇకనైనా ఇటువంటి రూమర్లు ఆగాలంటే మహేష్ త్వరగా టైటిల్ ఎనౌన్స్ చేయడం బెటర్.